Wonder World 16

అమెరికా కోతులకు ఐపాడ్‌లు! నమ్మలేకపోతున్నారా….? నిజమేనండీ అమెరికా నేషనల్‌ జూకి వెళితే ఈ విషయాన్ని మీరు మీ కళ్లతో చూడవచ్చు. అక్కడ ఒరాంగుటాన్‌ రకం కోతులకు జూ సిబ్బంది ఐపాడ్‌లను ఇస్తున్నారు. అవి వాటిని చక్కగా ఉపయోగిస్తున్నాయి కూడా. ఐపాడ్‌లను ఉపయోగించి మ్యూజిక్‌ వినడం, డ్రాయింగ్‌, గేమ్స్‌ ఆడడం వంటి పదిరకాల పనులను చేయగలుగుతున్నాయని జూ అధికారులంటున్నారు. మనుషులకు వలెనే జంతువుల జీవన విధానం కూడా రోజురోజుకూ మారుతున్నదని స్మిత్‌సోనియన్‌ నేషనల్‌ జూ అధికారి బెకీ మాలిన్‌స్కీ […]

Advertisement
Update:2015-09-04 10:34 IST

అమెరికా కోతులకు ఐపాడ్‌లు!

నమ్మలేకపోతున్నారా….? నిజమేనండీ అమెరికా నేషనల్‌ జూకి వెళితే ఈ విషయాన్ని మీరు మీ కళ్లతో చూడవచ్చు. అక్కడ ఒరాంగుటాన్‌ రకం కోతులకు జూ సిబ్బంది ఐపాడ్‌లను ఇస్తున్నారు. అవి వాటిని చక్కగా ఉపయోగిస్తున్నాయి కూడా. ఐపాడ్‌లను ఉపయోగించి మ్యూజిక్‌ వినడం, డ్రాయింగ్‌, గేమ్స్‌ ఆడడం వంటి పదిరకాల పనులను చేయగలుగుతున్నాయని జూ అధికారులంటున్నారు. మనుషులకు వలెనే జంతువుల జీవన విధానం కూడా రోజురోజుకూ మారుతున్నదని స్మిత్‌సోనియన్‌ నేషనల్‌ జూ అధికారి బెకీ మాలిన్‌స్కీ చెప్పారు. ”కోతుల ఆహారం, ఆటవస్తువులు, ఇతర కార్యకలాపాలు ప్రతిరోజూ మార్చి చూస్తుంటాం. ఐపాడ్‌ ఆలోచన మాత్రం వినూత్నమైనదే. దీనివల్ల వాటి దృష్టి, స్పర్శ, వినికిడి సామర్థ్యాల గురించి తెలుసుకునే అవకాశం కలిగింది” అని బెకీ తెలిపారు. ఐపాడ్‌లలో పది రకాల అప్లికేషన్లను కోతులు ఉపయోగిస్తున్నాయని ఆయన వివరించారు. 36 ఏళ్ల బోనీకి డ్రమ్స్‌ వాయించడమంటే చాల ఇష్టమట. 16 ఏళ్ల కైల్‌కైతే పియానో ప్లే చేయడమంటే భలే సరదా. ఇక 25 ఏళ్ల ఐరిస్‌ మాత్రం స్క్రీన్‌పై కన్పించే వర్చువల్‌ స్విమ్మింగ్‌పూల్‌లో చేపలు ఈదుతుంటే ఎంతో ముచ్చటపడిపోతుందట. ఒరాంగుటాన్‌ ఔట్‌రీచ్‌ అనే సంస్థ ”యాప్స్‌ ఫర్‌ ఏప్స్‌” కార్యక్రమాన్ని చేపట్టి కోతులకు ఐపాడ్స్‌ సరఫరా చేస్తున్నది. స్మిత్‌సోనియన్‌ జూతో పాటు మరో 12 జూలలోని కోతులకు కూడా ఐపాడ్‌లు అందించాలని ఈ సంస్థ భావిస్తున్నది. అంతరించిపోతున్న జంతువుల జాబితాలో ఒరాంగుటాన్‌ రకం కోతులు కూడా ఉన్నాయని, వీటి ప్రాధాన్యత మనుషులకు అర్ధం కావడం కోసమే తాము ‘యాప్స్‌ ఫర్‌ ఏప్స్‌” కార్యక్రమాన్ని తీసుకున్నామని ఒరాంగుటాన్‌ ఔట్‌రీచ్‌ సంస్థ సంస్థాపక డైరెక్టర్‌ రిచర్డ్‌ జిమ్మర్‌మాన్‌ తెలిపారు.

Tags:    
Advertisement

Similar News