సభను కుదిపేసిన ఓటుకు నోటు కేసు

ఐదో రోజు అసెంబ్లీ ప్రారంభంలోనే ఓటుకు నోటు కేసు సభను కుదిపేసింది. ఓటుకు నోటుపై చర్చించాలంటూ వైసీపీ వాయిదా తీర్మానం ఇవ్వగా దాన్ని స్పీకర్ తిరస్కరించి ప్రత్నోత్తరాలను ప్రారంభించారు. దీంతో విపక్షం సభను అడ్డుకుంది… ఓటుకు నోటుపై చర్చించాల్సిందేనంటూ వైఎస్‌ఆర్‌సీపీ సభ్యులు స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు. ఓటుకు ఐదు కోట్లు అంటూ వైసీపీ సభ్యులు నినాదాలు చేశారు. ఓ దశలో జగన్ మాట్లాడేందుకు స్పీకర్ మైక్ ఇచ్చారు. జగన్ లేచి ”లంచాలు తీసుకుని పక్కరాష్ట్రంలో అనగానే స్పీకర్ […]

Advertisement
Update:2015-09-04 07:16 IST
ఐదో రోజు అసెంబ్లీ ప్రారంభంలోనే ఓటుకు నోటు కేసు సభను కుదిపేసింది. ఓటుకు నోటుపై చర్చించాలంటూ వైసీపీ వాయిదా తీర్మానం ఇవ్వగా దాన్ని స్పీకర్ తిరస్కరించి ప్రత్నోత్తరాలను ప్రారంభించారు. దీంతో విపక్షం సభను అడ్డుకుంది… ఓటుకు నోటుపై చర్చించాల్సిందేనంటూ వైఎస్‌ఆర్‌సీపీ సభ్యులు స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు. ఓటుకు ఐదు కోట్లు అంటూ వైసీపీ సభ్యులు నినాదాలు చేశారు. ఓ దశలో జగన్ మాట్లాడేందుకు స్పీకర్ మైక్ ఇచ్చారు. జగన్ లేచి ”లంచాలు తీసుకుని పక్కరాష్ట్రంలో అనగానే స్పీకర్ మైక్ కట్ చేశారు. చర్చలోకి వెళ్లేందుకు అనుమతించనని చెప్పారు. దీంతో వైసీపీ సభ్యులు మళ్లీ నినాదాలు చేశారు. అయితే వైసీపీ సభ్యులు మాట్లాడేందుకు అవకాశం రాకున్నా… టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు మాత్రం వరుస పెట్టి మాట్లాడారు. చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు, మంత్రులు అచ్చెన్నాయుడు, రావెల కిషోర్ బాబు, పీతల సుజాత, ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, బొండా ఉమా ఇలా వరుస పెట్టి వైసీపీని , జగన్‌ను తీవ్ర స్థాయిలో విమర్శించారు. వైసీపీది రాజకీయ వ్యభిచారమని కాల్వ శ్రీనివాసులు వ్యాఖ్యనించారు. ఓటుకు నోటుకు ఏపీకి సంబంధమే లేదన్నారు. కేసీఆర్ డైరెక్షన్ తోనే ఓటుకు నోటుపై వైసీపీ వాయిదా తీర్మానం ఇచ్చిందని అచ్చెన్నాయుడు ఆరోపించారు. ఇలా టీడీపీ సభ్యులంతా మూకుమ్మడిగా జగన్‌పై మాటల దాడి చేసిన తర్వాత కూడా సభ అదుపులోకి రాకపోవడంతో సభను స్పీకర్ 10 నిమిషాలు వాయిదా వేశారు.
Tags:    
Advertisement

Similar News