7 నుంచి ఎయిర్‌ఫోర్స్ రిక్రూట్‌మెంట్ ర్యాలీ
ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో గ్రూపు-ఎక్స్ , వై ట్రేడ్‌లకు రిక్రూట్‌మెంట్ ర్యాలీని నిర్వహిస్తున్నట్లు యువజన సంక్షేమ శాఖాధికారి మోతీలాల్ ఒక ప్రకటనలో తెలిపారు. సెప్టెంబర్ 7 నుంచి 14 వరకు మెదక్ జిల్లా సంగారెడ్డిలోని ఎస్పీ క్యాంపస్ పోలీస్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఉదయం 7 గంటల నుంచి ఈ ర్యాలీ జరుగుతుందని ఆయన వెల్లడించారు. అవివాహిత పురుష అభ్యర్థులు మాత్రమే ర్యాలీకి హాజరు కావాలని పేర్కొన్నారు. అర్హతలు… గూపు ఎక్స్ ట్రేడ్(ఎడ్యుకేషన్ ఇన్‌స్ట్రక్టర్) ఉద్యోగానికి కనీసం 50 శాతం […]
Advertisement
ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో గ్రూపు-ఎక్స్ , వై ట్రేడ్‌లకు రిక్రూట్‌మెంట్ ర్యాలీని నిర్వహిస్తున్నట్లు యువజన సంక్షేమ శాఖాధికారి మోతీలాల్ ఒక ప్రకటనలో తెలిపారు. సెప్టెంబర్ 7 నుంచి 14 వరకు మెదక్ జిల్లా సంగారెడ్డిలోని ఎస్పీ క్యాంపస్ పోలీస్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఉదయం 7 గంటల నుంచి ఈ ర్యాలీ జరుగుతుందని ఆయన వెల్లడించారు. అవివాహిత పురుష అభ్యర్థులు మాత్రమే ర్యాలీకి హాజరు కావాలని పేర్కొన్నారు.
అర్హతలు…
గూపు ఎక్స్ ట్రేడ్(ఎడ్యుకేషన్ ఇన్‌స్ట్రక్టర్) ఉద్యోగానికి కనీసం 50 శాతం మార్కులతో ఆర్ట్స్, కామర్స్, సైన్స్‌లో డిగ్రీతో పాటు బీఈడీ పూర్తి చేసి ఉండాలి. నమోదు చేసే నాటికి గ్రాడ్యుయేట్లకు 25 ఏళ్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లకు 28 ఏళ్ల వయో పరిమితి మించరాదు. తెలంగాణలోని పది జిల్లాల నుంచి వచ్చిన వారికి సెప్టెంబర్ 8న రాత పరీక్ష, అడాప్టబిలిటీ (స్వీకృతి), శరీర ధారుడ్య పరీక్షలు నిర్వహిస్తారు. 9న ఇంటర్వ్యూలు జరుగుతాయి. గ్రూప్ వై ట్రేడ్(సెక్యూరిటీ) ఉద్యోగానికి ఇంటర్మీడియట్ లేదా తత్సమాన పరీక్షల్లో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత కలిగి ఉండాలి. వయోపరిమితి 21 ఏళ్లు మించరాదు. సెప్టెంబర్ 10, 11 తేదీల్లో ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, కరీంనగర్ జిల్లాల వారు, సెప్టెంబర్ 12, 13 తేదీల్లో హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల వారికి పరీక్షలు, ఇంటర్వ్యూలు ఉంటాయి.
Advertisement