తల్లిదండ్రుల శవాల మధ్య ఏడాది బాబు!
హైదరాబాద్‌లో విషాదం చోటచేసుకుంది. ఏడాది వయసున్న బాబు తల్లిదండ్రుల మృతదేహాల నడుమ రెండురోజులపాటు ఏడుస్తూ గడిపిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బెంగళూరుకు చెందిన మంజునాథ దంపతులు కూకట్పల్లి జగద్గిరిగుట్ట కమలా ప్రసన్న నగర్‌లో ఓ అపార్ట్‌మెంట్‌లో అద్దెకు ఉంటున్నారు. వీరికి ఏడాది బాబు ఉన్నాడు. మంజునాథ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగి. గురువారం రాత్రి నుంచి వీరి ఏడాది బాబు గుక్కపట్టి ఏడుస్తున్నాడు.. శుక్రవారం ఉదయం కూడా బాబు ఏడుపు ఆపకపోవడంతో.. ఇరుగుపొరుగు వారి వచ్చి చూడగా […]
Advertisement
హైదరాబాద్‌లో విషాదం చోటచేసుకుంది. ఏడాది వయసున్న బాబు తల్లిదండ్రుల మృతదేహాల నడుమ రెండురోజులపాటు ఏడుస్తూ గడిపిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బెంగళూరుకు చెందిన మంజునాథ దంపతులు కూకట్పల్లి జగద్గిరిగుట్ట కమలా ప్రసన్న నగర్‌లో ఓ అపార్ట్‌మెంట్‌లో అద్దెకు ఉంటున్నారు. వీరికి ఏడాది బాబు ఉన్నాడు. మంజునాథ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగి. గురువారం రాత్రి నుంచి వీరి ఏడాది బాబు గుక్కపట్టి ఏడుస్తున్నాడు.. శుక్రవారం ఉదయం కూడా బాబు ఏడుపు ఆపకపోవడంతో.. ఇరుగుపొరుగు వారి వచ్చి చూడగా బాబు శవాల మధ్య ఏడుస్తుండటం వారిని కలిచి వేసింది. వీరు గురువారమే చనిపోయారని, అప్పటి నుంచి బాబు ఏడుస్తూనే ఉన్నాడని చుట్టుపక్కల వారు చెప్పడంతో అక్కడికి వచ్చినవారు కన్నీటిపర్యంతమయ్యారు. దంపతులు ఆత్మహత్య చేసుకున్నారా? ఎవరైనా చంపారా? అన్న విషయాలు ఇంకా తెలియలేదు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుని బంధువుల చిరునామాను కనుక్కునేందుకు ప్రయత్నిస్తున్నారు.
Advertisement