పశ్చిమగోదావరి జిల్లాలో మరో సైకో కలకలం
పశ్చిమగోదావరి జిల్లాలో మళ్లీ సైకో కలకలం రేగింది. ఇప్పటికే ఈ సైకో వల్ల ప్రజలు భయబ్రాంతులకు గురవుతుండగా… పోలీసులకు మాత్రం కంటిమీద కునుకు లేకుండా పోయింది. దాదాపు 18 మంది వరకు సైకో బాధితుల జాబితాలో చేరుకోగా…. తాజాగా గురువారం సాయంత్రం పెనుగొండ మండలం తాటిచెట్లపాలెం గ్రామం వద్ద ఓ బాలుడికి ఇంజెక్షన్ వేసి పరారయ్యాడు. ప్రస్తుతం ఆ బాలుడ్ని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. భీమవరంలో ఓ సైకోను అరెస్ట్ చేసి పోలీసులు విచారణ జరుపుతుండగా […]
Advertisement
పశ్చిమగోదావరి జిల్లాలో మళ్లీ సైకో కలకలం రేగింది. ఇప్పటికే ఈ సైకో వల్ల ప్రజలు భయబ్రాంతులకు గురవుతుండగా… పోలీసులకు మాత్రం కంటిమీద కునుకు లేకుండా పోయింది. దాదాపు 18 మంది వరకు సైకో బాధితుల జాబితాలో చేరుకోగా…. తాజాగా గురువారం సాయంత్రం పెనుగొండ మండలం తాటిచెట్లపాలెం గ్రామం వద్ద ఓ బాలుడికి ఇంజెక్షన్ వేసి పరారయ్యాడు. ప్రస్తుతం ఆ బాలుడ్ని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. భీమవరంలో ఓ సైకోను అరెస్ట్ చేసి పోలీసులు విచారణ జరుపుతుండగా మరో సైకో పెనుగొండ దగ్గర ఓ పిల్లాడికి ఇంజెక్షన్ ఇవ్వడం ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తోంది. కాగా తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలోని సంగీతరావు పేటకు చెందిన అడపా దుర్గా ప్రసాద్(21)పై మహిళా సైకో దాడి జరిగిందనడం అవాస్తవమని పెద్దాపురం డిఎస్‌పి రాజశేఖర్ తెలిపారు. బాధితుడు దుర్గాప్రసాద్‌కు వైద్యులు పరీక్షలు కూడా నిర్వహించగా అతను చెప్పింది అబద్దమని తేలిందని, అది అసలు ఇంజక్షన్ దాడి కాదని తేలిందన్నారు. ఇటువంటి దుష్ప్రచారాలను ప్రజలు నమ్మకూడదన్నారు.
Advertisement