శిక్షపడే వరకు పోరాటం: రిషితేశ్వరి తండ్రి
తన కుమార్తె ఆత్మహత్యకు కారణమైన వారిని గుర్తించినప్పటికీ ఇంతవరకు వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆత్మహత్యకు గురైన రిషితేశ్వరి తండ్రి మురళీకృష్ణ ప్రశ్నించారు. నిందితులకు శిక్షపడే వరకు తన పోరాటం కొనసాగిస్తానని రుషితేశ్వరి తండ్రి మురళీకృష్ణ చెప్పారు. ఏపీ సీం చంద్రబాబుకు ఆయన లేఖ రాస్తూ తన కూతురు ఆత్మహత్య కేసులో సిట్టింగ్ న్యాయమూర్తిచేత విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తన కుమార్తె ఆత్మహత్యకు బాధ్యుడైన ప్రిన్సిపాల్ బాబూరావుపై కేసు నమోదు చేయడంలో పోలీసులు ఎందుకు […]
Advertisement
తన కుమార్తె ఆత్మహత్యకు కారణమైన వారిని గుర్తించినప్పటికీ ఇంతవరకు వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆత్మహత్యకు గురైన రిషితేశ్వరి తండ్రి మురళీకృష్ణ ప్రశ్నించారు. నిందితులకు శిక్షపడే వరకు తన పోరాటం కొనసాగిస్తానని రుషితేశ్వరి తండ్రి మురళీకృష్ణ చెప్పారు. ఏపీ సీం చంద్రబాబుకు ఆయన లేఖ రాస్తూ తన కూతురు ఆత్మహత్య కేసులో సిట్టింగ్ న్యాయమూర్తిచేత విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తన కుమార్తె ఆత్మహత్యకు బాధ్యుడైన ప్రిన్సిపాల్ బాబూరావుపై కేసు నమోదు చేయడంలో పోలీసులు ఎందుకు వెనకడగు వేస్తున్నారని, దీని వెనుక ఎవరున్నారని నిలదీశారు. తన కుమార్తె పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వారిపై ఇంత వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ప్రభుత్వం నియమించిన సుబ్రమణ్యం కమిటీ నివేదిక ర్యాగింగ్ జరిగిందని తేల్చిచెప్పినప్పటికీ బాబురావుపై ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని ఆ లేఖలో నిలదీశారు. బాబురావుపై బీఆర్కె ఉపాధ్యాయుడు డేవిడ్‌రాజు గవర్నర్‌కు ఫిర్యాదు చేసినా అతనిపై విచారణ జరగలేదని తెలిపారు. రిషితేశ్వరి కేసులో ఉన్న లోపాలను ఆయన సీఎంకు వివరించారు.
Advertisement