మాజీ సైనికులకు రెండు రోజుల్లో తీపికబురు
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కొనసాగుతున్న మాజీ సైనికోద్యోగుల నిరవధిక దీక్షలకు రెండు రోజుల్లో తెరపడే అవకాశం ఉంది. వన్ ర్యాంక్ వన్ పెన్షన్‌పై రెండు రోజుల్లో ప్రభుత్వం ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ముసాయిదా బిల్లును కూడా తయారు చేసినట్లు తెలిసింది. అయితే ప్రభుత్వం రూపొందించిన బిల్లు ఏకపక్షంగా ఉన్నట్లు తమకు తెలిసిందని, అదే నిజమైతే అంగీకరించేదే లేదని మాజీ సైనికోద్యోగులు తేల్చిచెబుతున్నారు. వన్ ర్యాంక్ వన్ పెన్షన్ కోసం మాజీ సైనికోద్యోగులు 82 […]
Advertisement
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కొనసాగుతున్న మాజీ సైనికోద్యోగుల నిరవధిక దీక్షలకు రెండు రోజుల్లో తెరపడే అవకాశం ఉంది. వన్ ర్యాంక్ వన్ పెన్షన్‌పై రెండు రోజుల్లో ప్రభుత్వం ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ముసాయిదా బిల్లును కూడా తయారు చేసినట్లు తెలిసింది. అయితే ప్రభుత్వం రూపొందించిన బిల్లు ఏకపక్షంగా ఉన్నట్లు తమకు తెలిసిందని, అదే నిజమైతే అంగీకరించేదే లేదని మాజీ సైనికోద్యోగులు తేల్చిచెబుతున్నారు. వన్ ర్యాంక్ వన్ పెన్షన్ కోసం మాజీ సైనికోద్యోగులు 82 రోజుల నుంచి దీక్షలు కొనసాగిస్తున్నారు.
Advertisement