హ‌య‌త్‌న‌గ‌ర్ హాస్ట‌ల్లో దుండ‌గులు!

హ‌య‌త్‌న‌గ‌ర్‌లోని ప్ర‌భుత్వ బాలిక‌ల హాస్ట‌ల్లో గురువారం అర్ధ‌రాత్రి దుండ‌గులు ప్ర‌వేశించారు. హాస్ట‌ల్ ప్ర‌హారీగోడ దూకి వ‌చ్చిన దుండ‌గులు బాలిక‌ల గ‌దుల్లోకి చొర‌బ‌డి వారిని భ‌య‌భ్రాంతుల‌కు గురిచేశారు. క‌త్తులుచూపించి బాలిక‌ల‌ను దుస్తులు విప్పాల‌ని బెదిరించారు.  బాలిక‌లు భ‌యంతో కేక‌లు వేయ‌డంతో వారు గోడ‌దూకి పారిపోయారు. ఘ‌ట‌న‌పై శుక్ర‌వారం ఉద‌యం పోలీసులకు స‌మాచారం అంద‌డంలో విచార‌ణ చేప‌ట్టారు. ఈ హాస్ట‌ల్‌కు ర‌క్ష‌ణ లేద‌ని, వార్డెన్‌, వాచ్‌మెన్ రాత్రిపూట ఉండ‌ర‌ని గ‌తంలోనే పోలీసుల‌కు ఫిర్యాదు కూడా చేశారు. ఇప్పుడు త‌మ‌కు ర‌క్ష‌ణ […]

Advertisement
Update:2015-09-03 18:36 IST
హ‌య‌త్‌న‌గ‌ర్‌లోని ప్ర‌భుత్వ బాలిక‌ల హాస్ట‌ల్లో గురువారం అర్ధ‌రాత్రి దుండ‌గులు ప్ర‌వేశించారు. హాస్ట‌ల్ ప్ర‌హారీగోడ దూకి వ‌చ్చిన దుండ‌గులు బాలిక‌ల గ‌దుల్లోకి చొర‌బ‌డి వారిని భ‌య‌భ్రాంతుల‌కు గురిచేశారు. క‌త్తులుచూపించి బాలిక‌ల‌ను దుస్తులు విప్పాల‌ని బెదిరించారు. బాలిక‌లు భ‌యంతో కేక‌లు వేయ‌డంతో వారు గోడ‌దూకి పారిపోయారు. ఘ‌ట‌న‌పై శుక్ర‌వారం ఉద‌యం పోలీసులకు స‌మాచారం అంద‌డంలో విచార‌ణ చేప‌ట్టారు. ఈ హాస్ట‌ల్‌కు ర‌క్ష‌ణ లేద‌ని, వార్డెన్‌, వాచ్‌మెన్ రాత్రిపూట ఉండ‌ర‌ని గ‌తంలోనే పోలీసుల‌కు ఫిర్యాదు కూడా చేశారు. ఇప్పుడు త‌మ‌కు ర‌క్ష‌ణ లేకుండా పోయింద‌ని బాలిక‌లు శుక్ర‌వారం పోలీసుల ఎదుట క‌న్నీళ్ల ప‌ర్యంత‌మ‌య్యారు. తామంతా పేద విద్యార్థినుల‌మ‌ని, ఇలాంటి ఘ‌ట‌న‌లు పున‌రావృత‌మైతే త‌మ త‌ల్లిదండ్రులు చ‌దువు మానిపిస్తార‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ద‌య‌చేసి త‌మ‌కు ర‌క్ష‌ణ క‌ల్పించాల‌ని వారు పోలీసుల‌ను వేడుకున్నారు. పోలీసులు ఈ ఘ‌ట‌న‌పై ఎలాంటి కేసు న‌మోదు చేయ‌న‌ప్ప‌టికీ.. విచార‌ణ మాత్రం చేస్తున్నారు.
Tags:    
Advertisement

Similar News