మూడో రోజు కూడా తీరు మారని సభ

సాగునీరు, రైతుల ఆత్మహత్యలపై చర్చించేందుకు వైఎస్‌ఆర్‌సీపీ ఇచ్చిన సావధాన తీర్మానాన్ని స్పీకర్ కోడెల శివప్రసాద్ తిరస్కరించి ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని చేపట్టేందుకు ప్రయత్నించడంతో వైసీపీ సభ్యులు వైయస్సార్ ఫోటోలతో ప్లకార్డులు పట్టుకొని స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు. అసెంబ్లీ హాలు నుండి వై.యస్స్ చిత్రపటాన్నితొలగించినందుకు నిరసన తెలియజేస్తూ సభా కార్యక్రమాలను అడ్డుకొనే ప్రయత్నం చేశారు. సభను 10 నిమిషాలు వాయిదా వేసి తిరిగి ప్రారంభించిన తరువాత కూడా వైకాపా సభ్యులు ఆందోళన కొనసాగించడంతో గందరగోళం నెలకొంది. కేవలం ఐదు రోజులు […]

Advertisement
Update:2015-09-03 00:46 IST

సాగునీరు, రైతుల ఆత్మహత్యలపై చర్చించేందుకు వైఎస్‌ఆర్‌సీపీ ఇచ్చిన సావధాన తీర్మానాన్ని స్పీకర్ కోడెల శివప్రసాద్ తిరస్కరించి ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని చేపట్టేందుకు ప్రయత్నించడంతో వైసీపీ సభ్యులు వైయస్సార్ ఫోటోలతో ప్లకార్డులు పట్టుకొని స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు. అసెంబ్లీ హాలు నుండి వై.యస్స్ చిత్రపటాన్నితొలగించినందుకు నిరసన తెలియజేస్తూ సభా కార్యక్రమాలను అడ్డుకొనే ప్రయత్నం చేశారు. సభను 10 నిమిషాలు వాయిదా వేసి తిరిగి ప్రారంభించిన తరువాత కూడా వైకాపా సభ్యులు ఆందోళన కొనసాగించడంతో గందరగోళం నెలకొంది. కేవలం ఐదు రోజులు మాత్రమే సాగే శాసనసభ సమావేశాలలో ప్రజాసమస్యలపై ఎటువంటి చర్చ జరపకుండా అధికార, ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు, వాగ్వాదాలతో మూడో రోజు కూడా సభ దాదాపు గడిచిపోయినట్టయ్యింది. శాసనసభలో ఎదుటి పక్షం సభ్యులు ప్రవర్తిస్తున్న తీరును టీవీ చానెళ్ళ ద్వారా ప్రజలు గమనించాలని విజ్ఞప్తులు చేయడం ద్వారా ప్రజల దృష్టిని ఆకర్షించడానికి ప్రయత్నించారు. అధికార, ప్రతిపక్ష పార్టీలు రెండూ కూడా శాసనసభను ఒక యుద్ధ వేదికగా భావిస్తున్నాయి తప్ప అది ప్రజాసమస్యలపై చర్చించవలసిన వేదికగా భావించకపోవడం రాష్ట్ర ప్రజల దురదృష్టం. కానీ గమ్మత్తయిన విషయం ఏమిటంటే అధికార, ప్రతిపక్షాలు రెండూ కూడా తాము ప్రజా సమస్యలపై చర్చించాలనుకొంటుంటే అవతలవారు అడ్డుపడుతున్నారని ఆరోపిస్తూ వ్యక్తిగత విమర్శలు, వాగ్వాదాలతో అమూల్యమయిన శాసనసభా సమయాన్ని వృదా చేస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News