చంద్రబాబుకు హరీష్‌రావు సవాల్‌!

వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్‌రెడ్డిని తన జీవితంలో ఇంతవరకు కలవలేదని తెలంగాణ నీటిపారుదలశాఖ మంత్రి హరీష్‌రావు స్పష్టం చేశారు. జగన్‌తో కలిసి హరీష్‌రావు ఓటుకు నోటు కేసుకు కుట్ర చేశారంటూ ఏపీ అసెంబ్లీలో మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి అచ్చెన్నాయుడు చేసిన ఆరోపణలపై ఆయన తీవ్రంగా స్పందించారు. ఒకవేళ జగన్‌ను కలిసినట్లు నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమని, లేకపోతే మీరు సిద్ధమా అంటూ చంద్రబాబునాయుడుకు సవాల్ విసిరారు. దమ్ము, ధైర్యం ఉంటే ఆధారాలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. చీకటి […]

Advertisement
Update:2015-09-03 01:17 IST
వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్‌రెడ్డిని తన జీవితంలో ఇంతవరకు కలవలేదని తెలంగాణ నీటిపారుదలశాఖ మంత్రి హరీష్‌రావు స్పష్టం చేశారు. జగన్‌తో కలిసి హరీష్‌రావు ఓటుకు నోటు కేసుకు కుట్ర చేశారంటూ ఏపీ అసెంబ్లీలో మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి అచ్చెన్నాయుడు చేసిన ఆరోపణలపై ఆయన తీవ్రంగా స్పందించారు. ఒకవేళ జగన్‌ను కలిసినట్లు నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమని, లేకపోతే మీరు సిద్ధమా అంటూ చంద్రబాబునాయుడుకు సవాల్ విసిరారు. దమ్ము, ధైర్యం ఉంటే ఆధారాలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. చీకటి ఒప్పందాలు, చీకటి స్నేహాలు చేసుకోవాల్సిన అవసరం తనకు లేదని, ఆ చరిత్ర చంద్రబాబుకే ఉందని అన్నారు. ఓటుకు నోటు కేసులో పీకలదాకా కూరుకుపోయిన చంద్రబాబు మతి భ్రమించి మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. హరీష్-జగన్ భేటీపై ఆధారాలు బయటపెడతామని టీడీపీవారు దాదాపు రెండు నెలల నుంచి చెబుతున్నారుగానీ, ఎందుకనో బయట పెట్టటం లేదు. ఆధారాలు ఉంటే అవి బయటపెట్టేస్తే ఒక పనయిపోతుందికదా అంటూ చమత్కరించారు. అయితే మరోవైపు హరీష్ రావు, జగన్, స్టీఫెన్సన్ మే 21న హోటల్‌లో కలుసుకున్నది వాస్తవమని మంత్రి అచ్చెన్నాయుడు మరోసారి చెప్పారు. హోటల్ సీసీ ఫుటేజిని తొలగింపజేశారని ఆరోపించారు. ఆ ముగ్గురూ కలుసుకున్నట్లు తమదగ్గర ఆధారాలున్నాయని మంత్రి ఇవాళ అసెంబ్లీలో మరోసారి చెప్పారు.
Tags:    
Advertisement

Similar News