విభజనతో ఏపీకి ఎంతో అన్యాయం: చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌ విభజన సమయంలో ఏపీకి జరిగిన అన్యాయం అంతాఇంతా కాదని, ఆస్తులు, అప్పుల పంపకాల్లో ఏపీకి అన్యాయం జరిగిందని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చెప్పారు. హైదరాబాద్ వంటి రాజధాని నిర్మించాలంటే ఇరవై సంవత్సరాలు పడుతుందని, రాజధానుల వల్లే రాష్ట్రాలకు ఆదాయం వస్తుందని ఆయన అన్నారు. ప్రత్యేక హోదాపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు శాసనమండలిలో ప్రకటన చేశారు. అన్యాయాన్ని సరిదిద్దడానికి తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నామని, కేంద్రాన్ని తగినరీతిలో సాయం చేయమని అర్ధిస్తున్నామని చెప్పారు. ప్రత్యేక హోదాలో […]

Advertisement
Update:2015-09-03 08:55 IST
ఆంధ్రప్రదేశ్‌ విభజన సమయంలో ఏపీకి జరిగిన అన్యాయం అంతాఇంతా కాదని, ఆస్తులు, అప్పుల పంపకాల్లో ఏపీకి అన్యాయం జరిగిందని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చెప్పారు. హైదరాబాద్ వంటి రాజధాని నిర్మించాలంటే ఇరవై సంవత్సరాలు పడుతుందని, రాజధానుల వల్లే రాష్ట్రాలకు ఆదాయం వస్తుందని ఆయన అన్నారు. ప్రత్యేక హోదాపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు శాసనమండలిలో ప్రకటన చేశారు. అన్యాయాన్ని సరిదిద్దడానికి తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నామని, కేంద్రాన్ని తగినరీతిలో సాయం చేయమని అర్ధిస్తున్నామని చెప్పారు. ప్రత్యేక హోదాలో పరిశ్రమలకు రాయితీల అంశం లేదని చెప్పారు. రాయలసీమ, ఉత్తరాంధ్రలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిపారు. విశాఖ-చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్‌కు రూ.4500 కోట్లు మంజూరైనట్లు బాబు చెప్పారు. ఐఐటీ, ఐఐఎమ్ లాంటి సంస్థలు రాష్ట్రానికి రావడం హర్షణీయమని బాబు అన్నారు. గోదావరి ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడి లాంటిదని, పోలవరాన్ని తప్పకుండా పూర్తిచేసి తీరుతామని చంద్రబాబు తెలిపారు. ఏపీకి ప్రత్యేక రైల్వే జోన్ కోరామని, త్వరలోనే ఇది సాకారమవుతుందని చంద్రబాబు చెప్పారు. విశాఖలో మెట్రో రైల్ ప్రాజెక్టుకు అన్ని విధాలుగా కృషి చేస్తున్నామని బాబు తెలిపారు. రాజధానిలో శాంతిభద్రతలకు సంబంధించిన అన్ని అధికారాలు గవర్నర్‌కే చెందుతాయని, తెలంగాణ ప్రభుత్వానికి ఈ విషయంలో ఎటువంటి అధికారం లేదని ఆయన చెప్పారు. రెండు ప్రాంతాలకు న్యాయం చేసి విభజన చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరానని, తమ విన్నపాన్ని వారు పెడచెవిన పెట్టారని, ఫలితం అనుభవించారని ఆయన అన్నారు. ప్రత్యేక హోదా కోసం ఆత్మహత్యలు జరగడం బాధాకరమన్నారు. హోదా తప్పనిసరిగా వస్తుందని, ఎవరూ తొందరపడి ఆత్మహత్యలకు పాల్పడవద్దని చంద్రబాబు సూచించారు. హైదరాబాద్‌ను అభివృద్ధి చేసింది తామేనని గుర్తు చేశారు.
Tags:    
Advertisement

Similar News