మీది సైకో పార్టీ... కాదు మీరు రౌడీలు

శాసనసభలో నాలుగోరోజు కొనసాగుతున్న గందరగోళం అసెంబ్లీ నాలుగోరోజు కూడా వాడివేడిగా జరుగుతోంది. మాటకు మాట సమాధానంతో గందరగోళ పరిస్థితి సంతరించుకుంది. అధికార పక్షం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని సైకో పార్టీ అని వ్యాఖ్యానించగా దీనికి ప్రతిగా ఆ పార్టీ నాయకుడు జగన్‌ రౌడీల మధ్య సభ జరుగుతుందని ప్రతి విమర్శ చేశారు. దీంతో ఉభయ పక్షాల నుంచి తీవ్ర నిరసనతో సభలో గందరగోళం నెలకొంది. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు జోక్యం చేసుకుని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. […]

Advertisement
Update:2015-09-03 07:35 IST
శాసనసభలో నాలుగోరోజు కొనసాగుతున్న గందరగోళం
అసెంబ్లీ నాలుగోరోజు కూడా వాడివేడిగా జరుగుతోంది. మాటకు మాట సమాధానంతో గందరగోళ పరిస్థితి సంతరించుకుంది. అధికార పక్షం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని సైకో పార్టీ అని వ్యాఖ్యానించగా దీనికి ప్రతిగా ఆ పార్టీ నాయకుడు జగన్‌ రౌడీల మధ్య సభ జరుగుతుందని ప్రతి విమర్శ చేశారు. దీంతో ఉభయ పక్షాల నుంచి తీవ్ర నిరసనతో సభలో గందరగోళం నెలకొంది. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు జోక్యం చేసుకుని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సభా సమయాన్ని వృథా చేయవద్దన్నారు. ప్రతి విషయానికి విపక్ష సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు రావడం సరికాదని మంత్రి అన్నారు. వైసీపీ కాదు… సైకో పార్టీ అని పేరుపెట్టుకోండని మరోసారి అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. దీంతో వైసీపీ సభ్యులు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి నినాదాలా చేయడంతో సభ మరోసారి వాయిదా పడింది. సభ మళ్ళీ సమావేశమైన తర్వాత వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు జగన్ మాట్లాడుతూ వైసీపీ సైకో పార్టీ కాదని, సభలో రౌడీ సీఎం, రౌడీ ఎమ్మెల్యేలు ఉన్నారని జగన్ అన్నారు. ఈ వ్యాఖ్యలపై టీడీపీ సభ్యులు తీవ్ర స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేశారు. నేరాలే వృత్తిగా సాగుతున్న కుటుంబం నుంచి వచ్చిన జగన్ చంద్రబాబును రౌడీ ముఖ్యమంత్రి అంటుంటే నిజాయితీ సిగ్గుతో తలదించుకుంటుందని విప్ కాల్వ శ్రీనివాసులు మండిపడ్డారు. జగన్‌పై కాల్వ శ్రీనివాసులు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా వైసీపీ సభ్యులు స్పీకర్ పోడియంను ముట్టడించారు. దీంతో సభలో కొద్దిసేపు గందరగోళ వాతావరణం నెలకొంది. ఇదే సమయంలో మరో సభ్యుడు పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి జోక్యం చేసుకుని ప్రతిపక్ష నాయకుడు సభా హక్కులను హరించేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. అవినీతికి ప్రతిరూపమైన వైసీపీ ముఖ్యమంత్రిపై అర్థంపర్ధం లేని ఆరోపణలు చేయడం తగదని హితవు పలికారు. జగన్ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని టీడీపీ సభ్యులు డిమాండ్ చేశారు.
Tags:    
Advertisement

Similar News