9 సవరణ బిల్లులకు అసెంబ్లీ ఆమోదం
తొమ్మిది సవరణ బిల్లులకు ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఆర్థిక నేరాల్లో అవినీతిపరుల ఆస్తుల జప్తునకు చట్టసవరణ అనే బిల్లుకు కూడా అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఆర్థిక నేరాల విచారణకు ప్రత్యేకకోర్టును ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. దేవాదాయశాఖకు సంబంధించిన మరో బిల్లుకు కూడా ఆమోదం తెలిపింది. మూడు రోజులుగా సరైన చర్చ జరగకుండా గందరగోళం మధ్య సాగుతున్న ఏపీ అసెంబ్లీ నాలుగో రోజు కూడా పెద్దగా ఆ పంథా నుంచి బయటపడలేదు. ఇక ఒకే రోజు మిగిలి […]
Advertisement
తొమ్మిది సవరణ బిల్లులకు ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఆర్థిక నేరాల్లో అవినీతిపరుల ఆస్తుల జప్తునకు చట్టసవరణ అనే బిల్లుకు కూడా అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఆర్థిక నేరాల విచారణకు ప్రత్యేకకోర్టును ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. దేవాదాయశాఖకు సంబంధించిన మరో బిల్లుకు కూడా ఆమోదం తెలిపింది. మూడు రోజులుగా సరైన చర్చ జరగకుండా గందరగోళం మధ్య సాగుతున్న ఏపీ అసెంబ్లీ నాలుగో రోజు కూడా పెద్దగా ఆ పంథా నుంచి బయటపడలేదు. ఇక ఒకే రోజు మిగిలి ఉండడంతో అత్యవసరంగా వీటిని ఆమోదించాల్సి ఉన్నందున బిల్లులను ప్రవేశపెడుతున్నట్టు ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు ప్రకటించారు. సభ వీటికి ఆమోదం తెలిపింది.
Advertisement