ర్యాగింగ్‌కు మ‌రో విద్యార్థి బ‌లి!

ర్యాగింగ్‌ భూతానికి మరో విద్యార్థి బలయ్యాడు! సీనియ‌ర్ల వేధింపులు త‌ట్టుకోలేక రైలు కింద ప‌డి ప్రాణాలు తీసుకున్నాడు. ఆదిలాబాద్‌ జిల్లా మందమర్రి మండలం రామకృష్ణాపూర్‌ గ్రామానికి చెందిన కనకయ్య కుమారుడు. వడ్లకొండ సాయినాథ్‌ (19). హైదరాబాద్‌ మేడ్చల్‌లోని సీఎంఆర్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ మొదటి సంవత్సరం చ‌దువుతున్నాడు. ఓ ప్రైవేట్‌ హాస్టల్‌లో ఉంటూ కాలేజీకి వెళ్తున్నాడు. 4 రోజులుగా సాయినాథ్‌ తరగతులకు హాజరుకాలేదు. శనివారం బోరబండలోని తన అక్క వద్దకు వెళ్లి రాఖీ కట్టించుకున్నాడు. సోమవారం మధ్యాహ్నం […]

Advertisement
Update:2015-09-01 18:36 IST

ర్యాగింగ్‌ భూతానికి మరో విద్యార్థి బలయ్యాడు! సీనియ‌ర్ల వేధింపులు త‌ట్టుకోలేక రైలు కింద ప‌డి ప్రాణాలు తీసుకున్నాడు. ఆదిలాబాద్‌ జిల్లా మందమర్రి మండలం రామకృష్ణాపూర్‌ గ్రామానికి చెందిన కనకయ్య కుమారుడు. వడ్లకొండ సాయినాథ్‌ (19). హైదరాబాద్‌ మేడ్చల్‌లోని సీఎంఆర్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ మొదటి సంవత్సరం చ‌దువుతున్నాడు. ఓ ప్రైవేట్‌ హాస్టల్‌లో ఉంటూ కాలేజీకి వెళ్తున్నాడు. 4 రోజులుగా సాయినాథ్‌ తరగతులకు హాజరుకాలేదు. శనివారం బోరబండలోని తన అక్క వద్దకు వెళ్లి రాఖీ కట్టించుకున్నాడు. సోమవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో హాస్టల్‌ నుంచి బయటకు వెళ్లాడు. అదే రోజు రాత్రి 12 గంటల సమయంలో వరంగల్‌-ఖాజీపేట మధ్యలో రైలు పట్టాలపై శవమై కనిపించాడు. ‘‘ప్లీజ్‌ స్టాప్‌ ద ర్యాగింగ్‌. ఆ రోజు సీనియర్లు అలా చేయకపోతే నాకు ఈ పరిస్థితి వచ్చిఉండేది కాదు’’ అని కాగితం రాసిపెట్టి.. రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. సాయినాథ్‌ దుస్తులను పోలీసులు తనిఖీ చేయగా ఒక కాగితం లభించింది. దాంట్లో అతడు ర్యాగింగ్‌ను ఆపాలని.. సీనియర్లు ‘అలా (ర్యాగింగ్‌?)’ చేయకపోతే తనకు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదని రాసి ఉంది.

Tags:    
Advertisement

Similar News