పారిస్‌లో 8 మంది సజీవ దహనం
పారిస్‌లోని ఓ అపార్టుమెంట్‌లో చెలరేగిన మంటల్లో చిక్కుకొని 8 మంది సజీవ దహనమయ్యారు. చనిపోయిన వారిలో ఇద్దరు పిల్లలు ఉన్నట్లు ఫ్రెంచ్ అంతర్గత వ్యవహారాల మంత్రి పియర్రే హెన్రీ బ్రాండెట్ తెలిపారు. గాయపడ్డ మరో నలుగురిని ఆసుపత్రికి తరలించారు. అపార్టుమెంట్ గ్రౌండ్ ఫ్లోర్‌లో మంటలు అంటుకొని పైఅంతస్తుల్లోకి వ్యాపించాయి. వంద మందికి పైగా అగ్ని మాపక సిబ్బంది మంటలను ఆర్పడానికి ప్రయత్నిస్తున్నారు. బుధవారం మధ్యాహ్నం ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. జ్వాలలు తమ పైకి వస్తున్నపుడు కిటీకీల […]
Advertisement
పారిస్‌లోని ఓ అపార్టుమెంట్‌లో చెలరేగిన మంటల్లో చిక్కుకొని 8 మంది సజీవ దహనమయ్యారు. చనిపోయిన వారిలో ఇద్దరు పిల్లలు ఉన్నట్లు ఫ్రెంచ్ అంతర్గత వ్యవహారాల మంత్రి పియర్రే హెన్రీ బ్రాండెట్ తెలిపారు. గాయపడ్డ మరో నలుగురిని ఆసుపత్రికి తరలించారు. అపార్టుమెంట్ గ్రౌండ్ ఫ్లోర్‌లో మంటలు అంటుకొని పైఅంతస్తుల్లోకి వ్యాపించాయి. వంద మందికి పైగా అగ్ని మాపక సిబ్బంది మంటలను ఆర్పడానికి ప్రయత్నిస్తున్నారు. బుధవారం మధ్యాహ్నం ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. జ్వాలలు తమ పైకి వస్తున్నపుడు కిటీకీల వద్దకు వచ్చి కాపాడండి అంటూ అరుపులు వినబడ్డట్లు ప్రత్యక్ష సాక్షుల కథనం. 2005లో పారిస్‌లోని ఓ హోటల్‌లో అగ్ని ప్రమాదం సంభవించి 24 మంది ఆఫ్రికా వాసులు మరణించిన తర్వాత ఇదే అతి పెద్ద సంఘటన.
Advertisement