పట్టిసీమపై మీ వైఖరేంటి?: వైసీపీకి చంద్రబాబు ప్రశ్న

గోదావరి జిల్లాలకు రెండో పంటకు నీళ్లిచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీదేనని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. పోలవరం పూర్తయ్యేలోపు సీలేరు ద్వారా రెండు పంటలకు నీళ్లిస్తామని హామీ ఇచ్చారు. పట్టిసీమపై వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ వైఖరేంటో చెప్పాలని, ఇంతకీ మీరు పట్టిసీమకు వ్యతిరేకమా? అనుకూలమా? అంటూ చంద్రబాబు సూటిగా ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీకి గోదావరి జిల్లాలంటే ఎనలేని ప్రేమని, టీడీపీకి అత్యధిక స్థానాలు కట్టబెట్టిన గోదావరి జిల్లాలకే తమ మొదటి ప్రాధాన్యత ఇస్తామని చంద్రబాబు చెప్పారు. పట్టిసీమపై వైసీపీకి […]

Advertisement
Update:2015-09-02 09:04 IST
గోదావరి జిల్లాలకు రెండో పంటకు నీళ్లిచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీదేనని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. పోలవరం పూర్తయ్యేలోపు సీలేరు ద్వారా రెండు పంటలకు నీళ్లిస్తామని హామీ ఇచ్చారు. పట్టిసీమపై వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ వైఖరేంటో చెప్పాలని, ఇంతకీ మీరు పట్టిసీమకు వ్యతిరేకమా? అనుకూలమా? అంటూ చంద్రబాబు సూటిగా ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీకి గోదావరి జిల్లాలంటే ఎనలేని ప్రేమని, టీడీపీకి అత్యధిక స్థానాలు కట్టబెట్టిన గోదావరి జిల్లాలకే తమ మొదటి ప్రాధాన్యత ఇస్తామని చంద్రబాబు చెప్పారు. పట్టిసీమపై వైసీపీకి జిల్లాకో వైఖరి ఉందని చంద్రబాబు ఎద్దేవా చేశారు. పులిచింతల ప్రాజెక్టుకు పది సంవత్సరాల్లో కాంగ్రెస్‌పార్టీ ఖర్చు పెట్టింది 256 కోట్లయితే తాము అధికారంలోకి వచ్చాక 15 నెలల్లో తమ ప్రభుత్వం రూ.246.79 కోట్లు ఖర్చు చేశామని ఆయన చెప్పారు. గోదావరి జిల్లాల ప్రజలను రెచ్చగొట్టేందుకు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. పోలవరం పూర్తయితే గోదావరి జిల్లాలకు మూడో పంటకు కూడా నీరిస్తామని తెలిపారు. ఈ ప్రాజెక్టుకు 1822 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని తెలిపారు. గోదావరి, కృష్ణా నదుల అనుసంధానానికే తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చంద్రబాబు చెప్పారు. దీనిపై స్పందించిన జ్యోతుల తాము కూడా దానికి అనుకూలమేనని ప్రకటించారు. పట్టిసీమ పేరుతో ప్రజాధనం దుర్వినియోగం అవుతున్నాయన్న బాధతోనే తాము మాట్లాడుతున్నామని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు జ్యోతుల నెహ్రు అన్నారు. అసలు ప్రాజెక్టు పూర్తి చేయకుండానే పట్టిసీమను జాతికి ఎలా అంకితం చేస్తారని ఆయన ప్రశ్నించారు. ఆగస్టు 31కల్లా పట్టిసీమ నీరు రాయలసీమకు ఇస్తామని చెప్పారని, కాని అది ఇంతవరకు పూర్తి కాలేదని, చేతకాని వాగ్దానాలు ఎలా చేస్తారని ఆయన నిలదీశారు.
Tags:    
Advertisement

Similar News