ప్రసూతి సెలవులు 8 నెలలకు పెంచనున్న కేంద్రం
గర్భిణులైన మహిళా ఉద్యోగులకు ఇచ్చే ప్రసూతి సెలవును 8 నెలలకు పెంచాలని కేంద్ర మహిళ, శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రతిపాదించింది. ఈ మేరకు మంగళవారం కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ అదనపు కార్యదర్శి నూతర్ గుహ బిశ్వాస్ ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం గర్భిణులైన ఉద్యోగులకు మూడు నెలలు మాత్రమే ప్రసూతి సెలవు ఇస్తున్నారు. దీనిని 8 నెలలకు పెంచే ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో ఉంది. ఈ దిశగా ప్రసూతి ప్రయోజనాల చట్టం, 1961ను […]
Advertisement
గర్భిణులైన మహిళా ఉద్యోగులకు ఇచ్చే ప్రసూతి సెలవును 8 నెలలకు పెంచాలని కేంద్ర మహిళ, శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రతిపాదించింది. ఈ మేరకు మంగళవారం కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ అదనపు కార్యదర్శి నూతర్ గుహ బిశ్వాస్ ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం గర్భిణులైన ఉద్యోగులకు మూడు నెలలు మాత్రమే ప్రసూతి సెలవు ఇస్తున్నారు. దీనిని 8 నెలలకు పెంచే ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో ఉంది. ఈ దిశగా ప్రసూతి ప్రయోజనాల చట్టం, 1961ను సవరించేందుకు కార్మిక శాఖ చర్యలు తీసుకుంటోందని తెలిపారు. కాన్పు అంచనా తేదికి ముందు నెల, కాన్పు తర్వాత ఏడు నెలలపాటు మహిళా ఉద్యోగులకు సెలవు మంజూరు చేయాలని ఆ శాఖ ప్రతిపాదించింది. కేంద్రం నుంచి దీనిపై స్పష్టమైన ఉత్తర్వులు జారీ అయిన తర్వాత, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అందుకనుగుణంగా ఈ సెలవును 8 నెలలకు పెంచుతారు.
Advertisement