లంకకు చిక్కిన 16మంది తమిళ జాలర్లు

నదీ జలాల విషయంలో శ్రీలంకతో త‌మిళ‌నాడుకు మరోసారి వివాదం నెలకొంది. శ్రీలంక నావికాదళం పదహారు మంది తమిళనాడు జాలర్లను అరెస్టు చేసింది. అంతర్జాతీయ తీర ప్రాంత రేఖను వారు దాటి తమ నదీ జలాల్లోకి వచ్చారని నావికాదళ అధికారులు తెలిపారు. కానీ తమిళ జాలర్లు కోడియాకరై అనే తీర ప్రాంతంలోనే మత్స్య వేటకు వెళ్లారు తప్ప శ్రీలంక నదీ జలాల్లోకి ప్రవేశించలేదని, అక్రమంగా తమ వారిని లంక సైన్యం అరెస్టు చేసిందని మత్స్య కారుల అసోసియేషన్ అధ్యక్షుడు […]

Advertisement
Update:2015-08-31 18:35 IST
నదీ జలాల విషయంలో శ్రీలంకతో త‌మిళ‌నాడుకు మరోసారి వివాదం నెలకొంది. శ్రీలంక నావికాదళం పదహారు మంది తమిళనాడు జాలర్లను అరెస్టు చేసింది. అంతర్జాతీయ తీర ప్రాంత రేఖను వారు దాటి తమ నదీ జలాల్లోకి వచ్చారని నావికాదళ అధికారులు తెలిపారు. కానీ తమిళ జాలర్లు కోడియాకరై అనే తీర ప్రాంతంలోనే మత్స్య వేటకు వెళ్లారు తప్ప శ్రీలంక నదీ జలాల్లోకి ప్రవేశించలేదని, అక్రమంగా తమ వారిని లంక సైన్యం అరెస్టు చేసిందని మత్స్య కారుల అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్ ఎమిరేట్ తెలిపారు. ఇదిలాఉండగా, అరెస్టు చేసిన తమిళ జాలర్లను, వారి బోటులను శ్రీలంకలోని జఫ్నా జిల్లా కాంగెన్ సంతురాయ్ వద్దకు తీసుకెళ్లారు. మరోపక్క, వీరితోపాటు బయలుదేరిన సెల్వరాజు అనే ఓ మత్యకారుడు చేపలు పట్టే క్రమంలో సముద్రంలో పడి చనిపోయినట్లు తెలిసింది.
Tags:    
Advertisement

Similar News