గద్దర్‌తో ముగిసిన వామపక్ష నేతల భేటి
త్వరలో జరగనున్న వరంగల్ పార్లమెంటు ఉప ఎన్నికలో పోటీ చేసేందుకు ప్రజా గాయకుడు గద్దర్ ఆసక్తి కనబరచ లేదని తెలిసింది. వామపక్ష పార్టీల అభ్యర్ధిగా గద్దర్‌ను పోటీలో దించేందుకు నిర్ణయించి ఆయన్ను కలిసిన వామపక్ష నేతలు తమ అభిప్రాయం తెలిపారు. అయితే దీనిపై గద్దర్ అంతగా ఆసక్తి చూపలేదు. సమావేశ అనంతరం వామపక్ష నేతలు మాట్లాడుతూ.. వరంగల్ ఉప ఎన్నికలో పోటీ చేయాలని గద్దర్‌ను కోరాం. 2-3 రోజుల్లో ఆయన తన నిర్ణయాన్ని చెబుతానని పేర్కొన్నారని తెలిపారు. […]
Advertisement
త్వరలో జరగనున్న వరంగల్ పార్లమెంటు ఉప ఎన్నికలో పోటీ చేసేందుకు ప్రజా గాయకుడు గద్దర్ ఆసక్తి కనబరచ లేదని తెలిసింది. వామపక్ష పార్టీల అభ్యర్ధిగా గద్దర్‌ను పోటీలో దించేందుకు నిర్ణయించి ఆయన్ను కలిసిన వామపక్ష నేతలు తమ అభిప్రాయం తెలిపారు. అయితే దీనిపై గద్దర్ అంతగా ఆసక్తి చూపలేదు. సమావేశ అనంతరం వామపక్ష నేతలు మాట్లాడుతూ.. వరంగల్ ఉప ఎన్నికలో పోటీ చేయాలని గద్దర్‌ను కోరాం. 2-3 రోజుల్లో ఆయన తన నిర్ణయాన్ని చెబుతానని పేర్కొన్నారని తెలిపారు. అదేవిధంగా భేటీపై గద్దర్ స్పందిస్తూ.. వరంగల్ ఉప ఎన్నికలో పోటీ చేయాలని వామపక్ష నేతలు కోరారు. ప్రస్తుతం ఉద్యమ పాటగా కొనసాగుతున్నా. రాజకీయాల్లోకి వచ్చే అంశంపై ఇప్పటికీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. నా రాజకీయ రంగ ప్రవేశం భవిష్యత్ నిర్ణయిస్తుంది. అందుకు ఎన్ని రోజులైనా పట్టొచ్చు. విప్లవ ఉద్యమాలు సజీవంగా ఉండాలి. రాజకీయాల్లోకి రావడంపై సీరియస్‌గా ఆలోచించి నిర్ణయం తీసుకుంటానని ఆయన పేర్కొన్నారు.
Advertisement