చంద్రబాబుకు హోదా బెనిఫిట్స్ తెలీదు: జగన్
ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రానికి ఎంత మేలు జరుగుతుందో చంద్రబాబునాయుడికి తెలీదని విపక్షనేత వై.ఎస్. జగన్ అన్నారు. ప్రత్యేక హోదాపై చర్చ సందర్భంలో అసెంబ్లీలో జగన్ మాట్లాడుతూ అసలు చంద్రబాబు ఏ విషయాన్నీఅధ్యయనం చేయరని, అంత సమయం కూడా ఆయనకు ఉండదని ఆరోపించారు. తెలియకుండానే తెలిసినట్టు అన్ని విషయాలు మాట్లాడతారని ఆయన అన్నారు. బాబుకు తెలియని ఎన్నో విషయాలు మాకు తెలుసన జగన్ అన్నారు. హోదాపై కేంద్ర కేబినెట్ నిర్ణయం అయ్యి ఇప్పటికి 18 నెలలు అయ్యిందని […]
Advertisement
ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రానికి ఎంత మేలు జరుగుతుందో చంద్రబాబునాయుడికి తెలీదని విపక్షనేత వై.ఎస్. జగన్ అన్నారు. ప్రత్యేక హోదాపై చర్చ సందర్భంలో అసెంబ్లీలో జగన్ మాట్లాడుతూ అసలు చంద్రబాబు ఏ విషయాన్నీఅధ్యయనం చేయరని, అంత సమయం కూడా ఆయనకు ఉండదని ఆరోపించారు. తెలియకుండానే తెలిసినట్టు అన్ని విషయాలు మాట్లాడతారని ఆయన అన్నారు. బాబుకు తెలియని ఎన్నో విషయాలు మాకు తెలుసన జగన్ అన్నారు. హోదాపై కేంద్ర కేబినెట్ నిర్ణయం అయ్యి ఇప్పటికి 18 నెలలు అయ్యిందని కాని అంగుళం కూడా ముందుకు కదలలేదని ఆయన అన్నారు. చంద్రబాబునాయుడు ప్రత్యేక హోదా వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదన్నట్టు మాట్లాడతారని, ఒకసారి అది సాధించి తీరతామని చెబుతారని… అసలు చంద్రబాబు నాయుడు ఏం చెబుతున్నారో తమకు అర్థం కావటం లేదని జగన్ మండిపడ్డారు. నోట్‌లో ఇచ్చిన దానికి, చంద్రబాబు నాయుడు మాట్లాడేదానికి సంబంధం లేదని అన్నారు. ఆయన ఏదేదో మాట్లాడుతున్నారు… మేం వింటున్నాం. హోదాపై ఏం చేయబోతున్నారో చెప్పండి… గతంలో ఏం జరిగిందో అందరికీ తెలుసని ఆయన తెలిపారు. చంద్రబాబు ప్రత్యేక హోదాపై కాకుండా ఏదేదో మాట్లాడుతున్నారని జగన్ చెప్పారు. 14వ ఆర్థిక సంఘం సిఫార్సు చేయలేదని ఒకసారి అంటారని, మరోసారి తమిళనాడు, ఒరిస్సా, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలు అడ్డుతగులుతున్నాయని చెబుతున్నారని, అసలు ఏం జరుగుతుందో అర్దం కావడం లేదని ఆయన అన్నారు.
అసలు ఈ రాష్ట్రాలన్నీ ఏపీ విభజన జరుగుతున్నప్పుడు ఉన్నవేనని, ఇప్పటికే ఈశాన్య రాష్ట్రాలు ప్రత్యేక హోదాను అనుభవిస్తున్న విషయం అందరికీ తెలిసిందేనని జగన్ అన్నారు. అబద్దాలు, అసత్యాలతో చంద్రబాబు ప్రచారం చేస్తారని జగన్ ఆరోపించారు. ఏదైనా ఒకటి రాదని తెలిస్తే దానిపై అద్భుతమైన ప్రచారం చేస్తారని, వస్తుందని తెలిస్తే అదేదో బ్రహ్మ పదార్థం సాధిస్తున్నట్టు ప్రచారం చేస్తారని ఆయన అన్నారు. కొందరు మంత్రులు వస్తుందంటారు… మరికొందరు మంత్రులు రాదంటారు… అసలు వస్తుందా, రాదా అన్నది ప్రభుత్వానికైనా తెలుసా అని ప్రశ్నించారు.
Advertisement