Wonder World 12

మంచినీటిలోనూ మనగలిగే షార్క్‌లు! సముద్రజలాలు ఉప్పునీటితోనూ, సరస్సులు, నదులు మంచినీటితోనూ ఉంటాయన్నది మనకు తెలిసిందే. షార్క్‌లు సముద్ర జలాల్లో మాత్రమే బతకగలుగుతాయని, సరస్సులు, నదులలో అవి మనజాలవని కొద్ది కాలం క్రితం వరకు నమ్ముతుండేవారు. కానీ షార్క్‌లు మంచినీటిలోనూ జీవించగలవని ఇటీవల శాస్త్రవేత్తలు గుర్తించారు. నికరాగువా మంచినీటి సరస్సులో షార్క్‌లు కనిపించడంతో ఈ నిర్ధారణకు వచ్చారు. అయితే అవి బుల్‌షార్క్‌లనే ఓ ప్రత్యేక మైన జాతికి చెందినవి కాబట్టే అలా మంచినీటిలో జీవించగలుగుతున్నాయని కొందరు శాస్త్రవేత్తలు వాదించారు. […]

Advertisement
Update:2015-08-30 18:34 IST

మంచినీటిలోనూ మనగలిగే షార్క్‌లు!

సముద్రజలాలు ఉప్పునీటితోనూ, సరస్సులు, నదులు మంచినీటితోనూ ఉంటాయన్నది మనకు తెలిసిందే. షార్క్‌లు సముద్ర జలాల్లో మాత్రమే బతకగలుగుతాయని, సరస్సులు, నదులలో అవి మనజాలవని కొద్ది కాలం క్రితం వరకు నమ్ముతుండేవారు. కానీ షార్క్‌లు మంచినీటిలోనూ జీవించగలవని ఇటీవల శాస్త్రవేత్తలు గుర్తించారు. నికరాగువా మంచినీటి సరస్సులో షార్క్‌లు కనిపించడంతో ఈ నిర్ధారణకు వచ్చారు. అయితే అవి బుల్‌షార్క్‌లనే ఓ ప్రత్యేక మైన జాతికి చెందినవి కాబట్టే అలా మంచినీటిలో జీవించగలుగుతున్నాయని కొందరు శాస్త్రవేత్తలు వాదించారు. అయితే ఏ రకం షార్క్‌లైనా మంచినీటిలో జీవించగలవని, అందుకోసం అవి ఉప్పునీటి షార్క్‌ల కన్నా ఎక్కువసార్లు మూత్ర విసర్జన చేసి తమ చుట్టూ ఉండే నీటిని కలుషితం చేస్తాయని శాస్త్రవేత్తలు గుర్తించారు.
—————————————————————————————————-
పాత్ర రంగును బట్టి రుచి!

పాత్ర రంగును బట్టి ఆ పదార్ధం రుచి కూడా మారుతుందని పరిశోధకులంటున్నారు. ఎరుపు రంగు కప్పులో కన్నా ఆరెంజ్‌ రంగు కప్పులో ఇచ్చే చాక్లెట్‌ క్రీమ్‌ టేస్టీగా ఉంటుందట. ఇది ఓ అధ్యయనంలో తేలింది. నిజానికి రెండింటిలోనూ సర్వ్‌ చేసింది ఒకే రకమైన క్రీమ్‌ని. కానీ కప్పు రంగును బట్టి రుచిలో తేడా ఉన్నట్లు సర్వేలో పాల్గొన్నవాళ్లు చెప్పారు. దానిని బట్టి చూస్తే పాత్ర రంగు కూడా రుచిని ప్రభావితం చేస్తుందని నమ్మాల్సిందే.
—————————————————————————————————-
మరణించినా విడగొట్టేశారు!

భూమిపైన అన్ని ప్రాంతాలలోనూ మతపరమైన పట్టింపులు చాలా పురాతన కాలంనుంచే ఉండేవనేందుకు ఇదో నిదర్శనం. 19వశతాబ్దంలో క్రైస్తవులలోని ప్రొటెస్టెంట్లకు, కేథలిక్కులకు కూడా అస్సలు పడేది కాదు. ఓ ప్రొటెస్టెంట్‌ యువకుడు, కేథలిక్‌ మహిళ ప్రేమించుకుని పెళ్లి చేసుకోవాలనుకున్నారు. పెద్దలు ఒప్పుకోక పోవడంతో ఆత్మహత్య చేసుకున్నారు. వారి భౌతిక కాయాలను ఒకే చోట పూడ్చిపెట్టడానికి కూడా మత పెద్దలు అంగీకరించలేదు. పక్కపక్కనే వారిని పూడ్చిపెట్టినా మధ్యలో గోడ కట్టేశారు. చివరకు వారి సమాధులను పై భాగంలో కలుపుతూ రెండు చేతులను ఇలా నిర్మించారు. దాంతో ఇది ఓ యాత్రాస్థలంగా మారింది. నాటి మతపరమైన ఆంక్షలకు ఇది ఓ సజీవ సాక్ష్యం.

Tags:    
Advertisement

Similar News