సీఎంగా జయకే తమిళ ఓటర్ల పట్టం
ముఖ్యమంత్రి పదవికి పురచ్ఛితలైవి తగిన అభ్యర్థి అని తాజా సర్వే చెబుతోంది. అయితే ప్రధాన ప్రత్యర్థి ఎంకె స్టాలిన్ ఆమెకు గట్టి పోటీ ఇచ్చారు. తమిళనాట జయలలితకు ఆదరణ తగ్గలేదనడానికి తాజా సర్వే ప్రత్యక్షసాక్ష్యం అని రాజకీయవర్గాలు విశ్లేషిస్తున్నాయి. తమిళనాడులో ఇటీవల పీపుల్ స్టడీస్ సంస్థ నిర్వహించిన సర్వేలో ముఖ్యమంత్రిగా ఎవరు తగిన అభ్యర్థి అనే ప్రశ్నకు ప్రస్తుత సీఎం జయలలిత వైపే జనం మొగ్గు చూపారు. రాష్ట్రంలో 31.58 శాతం ఓటర్లు జయలలిత మళ్లీ సీఎం […]
Advertisement
ముఖ్యమంత్రి పదవికి పురచ్ఛితలైవి తగిన అభ్యర్థి అని తాజా సర్వే చెబుతోంది. అయితే ప్రధాన ప్రత్యర్థి ఎంకె స్టాలిన్ ఆమెకు గట్టి పోటీ ఇచ్చారు. తమిళనాట జయలలితకు ఆదరణ తగ్గలేదనడానికి తాజా సర్వే ప్రత్యక్షసాక్ష్యం అని రాజకీయవర్గాలు విశ్లేషిస్తున్నాయి. తమిళనాడులో ఇటీవల పీపుల్ స్టడీస్ సంస్థ నిర్వహించిన సర్వేలో ముఖ్యమంత్రిగా ఎవరు తగిన అభ్యర్థి అనే ప్రశ్నకు ప్రస్తుత సీఎం జయలలిత వైపే జనం మొగ్గు చూపారు. రాష్ట్రంలో 31.58 శాతం ఓటర్లు జయలలిత మళ్లీ సీఎం కావాలని కోరుకోగా… ఒకవేళ డీఎంకె గెలిస్తే కరుణానిధి తనయుడు ఎంకె స్టాలిన్ సీఎంగా ఉండాలని 27.98 శాతం మంది భావించారు. ఐదుసార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన కరుణానిధి సీఎం కావాలని 21.33 శాతం ఓటర్లు మాత్రమే కోరుకున్నారని సర్వే వెల్లడించింది.
Advertisement