మరో ఆలయం నేల మట్టం
దాదాపు రెండు వేల సంవత్సరాల చరిత్ర గల మరో ఆలయం కాల గర్భంలో కలిసిపోయింది. ఇస్లామిక్ ఉగ్రవాదులు సిరియాలోని చరిత్రాత్మక నగరం పామిరాలో మరో బాల్ ఆలయాన్ని కూల్చి వేశారు. బాంబులు పెట్టి దీన్ని ధ్వంసం చేసినట్టు తెలుస్తోంది. బాంబులు పేలినపుడు వెలువడిన శబ్ధాలు చెవికి చిల్లులు పడే విధంగా ఉన్నాయని ప్రత్యక్ష సాక్షుల కథనం. అదొక భారీ విస్ఫోటమని స్థానికుడొకరు చెప్పారు. ఆలయం ధ్వంసం సమయంలో ఏర్పడిన దుమ్ము దూళి భారీగా ఎగసి పడినట్లు అధికారులు […]
Advertisement
దాదాపు రెండు వేల సంవత్సరాల చరిత్ర గల మరో ఆలయం కాల గర్భంలో కలిసిపోయింది. ఇస్లామిక్ ఉగ్రవాదులు సిరియాలోని చరిత్రాత్మక నగరం పామిరాలో మరో బాల్ ఆలయాన్ని కూల్చి వేశారు. బాంబులు పెట్టి దీన్ని ధ్వంసం చేసినట్టు తెలుస్తోంది. బాంబులు పేలినపుడు వెలువడిన శబ్ధాలు చెవికి చిల్లులు పడే విధంగా ఉన్నాయని ప్రత్యక్ష సాక్షుల కథనం. అదొక భారీ విస్ఫోటమని స్థానికుడొకరు చెప్పారు. ఆలయం ధ్వంసం సమయంలో ఏర్పడిన దుమ్ము దూళి భారీగా ఎగసి పడినట్లు అధికారులు తెలిపారు. ఈ ఆలయం క్రీ.శ. 32లో నిర్మించబడిందని చెబుతున్నారు.
Advertisement