పుష్కర మరణాలు బాధాకరం: చంద్రబాబు

పుష్కరాలలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఇరవైతొమ్మిది మంది మరణించడం బాదాకరమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నామని అన్నారు. గోదావరి నధితో అనుసంధానం చేసుకోవాలని, ప్రజలలో మంచి స్పందన ఉందని, ఉభయ గోదావరి జిల్లాలలో పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్త్ ఏర్పాటు చేశామని చంద్రబాబు చెప్పారు.దురదృష్టవశాత్తు తొక్కిసలాట జరిగిందని, ఆ సమాచారం తెలిసిన వెంటనే తాను కంట్రోల్ రూమ్ కు వెళ్లి పర్యవేక్షణ చేశామని ఆయన తెలిపారు. పుష్కర మృతులకు సానుభూతి తెలియచేస్తున్నామని ఆయన చెప్పారు.మృతుల […]

Advertisement
Update:2015-08-31 08:00 IST
పుష్కరాలలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఇరవైతొమ్మిది మంది మరణించడం బాదాకరమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నామని అన్నారు. గోదావరి నధితో అనుసంధానం చేసుకోవాలని, ప్రజలలో మంచి స్పందన ఉందని, ఉభయ గోదావరి జిల్లాలలో పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్త్ ఏర్పాటు చేశామని చంద్రబాబు చెప్పారు.దురదృష్టవశాత్తు తొక్కిసలాట జరిగిందని, ఆ సమాచారం తెలిసిన వెంటనే తాను కంట్రోల్ రూమ్ కు వెళ్లి పర్యవేక్షణ చేశామని ఆయన తెలిపారు. పుష్కర మృతులకు సానుభూతి తెలియచేస్తున్నామని ఆయన చెప్పారు.మృతుల కుటుంబాలను ఆదుకోవడానికి చర్యలు తీసుకున్నామని అన్నారు. చర్చలో జోక్యం చేసుకున్న వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత జగన్‌ రాజమండ్రి పుష్కరాలలో తొక్కిసలాటలో మరణించిన వారికి ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రధ్దాంజలి ఘటించడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని అన్నారు. విఐపి ఘాట్ వద్ద ప్రత్యేక ఏర్పాట్లు ఉన్నా ముఖ్యమంత్రి చంద్రబాబు పబ్లిసిటీ కోసం పుష్కర ఘాట్‌లో స్నానానికి వచ్చారని ఆరోపించారు. చంద్రబాబు మేకప్ చేసుకుని వచ్చారని, సినిమాలో హీరోలా కనిపించాలని ఆయన ప్రయత్నం చేస్తూ సామాన్యులకు కేటాయించిన ఘాట్ వద్దకు చంద్రబాబు వచ్చారని అన్నారు. మనిషిని పొడిచి, ఆ తర్వాత దండలు వేసినట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. దీనిపై అధికారపక్ష సభ్యులంతా జగన్‌పై ఒక్కుదుటున ఒంటికాలిపై లేచారు. దీంతో స్పీకర్‌ కోడెల జోక్యం చేసుకుని మొత్తం శాసనసభపై ఆరోపణలు చేస్తున్నారని, వాటిని ఉపసంహరించుకోవాలని జగన్‌ను కోరారు. శాసనసభపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని కోడెల అన్నారు. తాను చంద్రబాబుపై ఆరోపణ చేస్తే శాసనసభపై ఆరోపణలు చేస్తున్నట్లు ఎలా అవుతుందని జగన్‌ ప్రశ్నించారు. దీనిపై మంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ సంతాప సందేశంలా కాకుండా పుష్కరాలపై జగన్‌ ఏదో ప్రకటన చేస్తున్నట్టు ఉందని, ఇలా నోటికొచ్చిన ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు. ఇది సంతాప సందేశంగా కనిపించడం లేదని, పరిమితంగానే మాట్లాడాలని, దీనికి సంబంధించిన చర్చలో అవసరమనుకుంటే మాట్లాడవచ్చని అన్నారు.
జగన్ చేసిన వ్యాఖ్యలను చంద్రబాబు ఖండించారు. ప్రతిపక్ష నేత జగన్ సభ్యత మరిచిపోయి మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. రాజమండ్రి ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని చంద్రబాబు చెప్పారు. రాజమండ్రి ఘటనపై చర్చకు సిద్ధమని ఆయన తెలిపారు. సంతాపాన్ని సంతాపంగానే చూడాలని ఆయన సూచించారు. ప్రతిపక్ష నేత ఇష్టానుసారం మాట్లాడుతున్నారని, వాస్తవాలను తెలుసుకుని మాట్లాడాలని చంద్రబాబు చెప్పారు.
Tags:    
Advertisement

Similar News