మహిళ కడుపులో డ్రగ్స్ ప్యాకెట్లు... 40 వెలికితీత!
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కోట్లాది రూపాయల విలువైన డ్రగ్స్‌ను అక్రమ మార్గంలో దేశంలోకి తీసుకురావడం కలకలం రేపింది. ఇంతకాలం అక్రమ బంగారం కేసులకు ప్రసిద్ధి చెందిన శంషాబాద్‌ను మాఫియా మాదకద్రవ్యాల రవాణాకూ వాడుకుంటుందని తాజా ఘటనతో ఝాడీ అయింది. దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన మూసా ముసీక(30) అనే మహిళ ఆదివారం మధ్యాహ్నం శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విమానం దిగింది. ఆమె పొత్తి కడుపు ఎత్తుగా ఉండటంతో కస్టమ్స్ సిబ్బందికి అనుమానం వచ్చి ప్రశ్నించారు. తాను గర్భవతినని చెప్పడంతో అనుమానం వచ్చిన కస్టమ్స్ […]
Advertisement
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కోట్లాది రూపాయల విలువైన డ్రగ్స్‌ను అక్రమ మార్గంలో దేశంలోకి తీసుకురావడం కలకలం రేపింది. ఇంతకాలం అక్రమ బంగారం కేసులకు ప్రసిద్ధి చెందిన శంషాబాద్‌ను మాఫియా మాదకద్రవ్యాల రవాణాకూ వాడుకుంటుందని తాజా ఘటనతో ఝాడీ అయింది. దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన మూసా ముసీక(30) అనే మహిళ ఆదివారం మధ్యాహ్నం శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విమానం దిగింది. ఆమె పొత్తి కడుపు ఎత్తుగా ఉండటంతో కస్టమ్స్ సిబ్బందికి అనుమానం వచ్చి ప్రశ్నించారు. తాను గర్భవతినని చెప్పడంతో అనుమానం వచ్చిన కస్టమ్స్ సిబ్బంది ఆమెకు బాడీ స్కాన్ చేయించారు. స్కానింగ్‌లో ఆమె శరీరం లోపల డ్రగ్స్ ప్యాకెట్లు ఉన్నట్లు గుర్తించారు. దీనితో ఆమెను ఉస్మానియా దవాఖానకు తరలించగా వైద్యులు ఒక ప్యాకెట్‌ను బయటకు తీశారు. కడుపులో ఉన్నది బ్రౌన్ షుగర్ కావచ్చని నార్కొటిక్స్ సెల్ భావిస్తున్నది. అయితే కడుపులో ఇంకా ప్యాకెట్లు ఉన్నాయని డాక్టర్లు చెప్పడంతో ఆమెకు ఆపరేషన్ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు సోమవారం ఉదయం ఉస్మానియా ఆసుపత్రిలో ఆపరేషన్ నిర్వహించగా ఇప్పటివరకు ఆమె కుడుపులో నుంచి 40 డ్రగ్స్ ప్యాకెట్లు బయటికి తీశారు. ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. దాదాపు మూడు కోట్ల విలువైన మాదక ద్రవ్యాలను ఆమె కడుపులో మోసుకొచ్చింది. ప్రస్తుతం మూసాని ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు తమ అదుపులో ఉంచుకున్నారు. దక్షిణాఫ్రికాకు చెందిన ఈమెని ఆస్పత్రిలో కోలుకున్నాక కోర్టులో హాజరుపరుస్తారు.
ఆ ప్యాకెట్లు ఎక్కడ నుంచి తెస్తోంది?
అయితే మూసా ఈ ప్యాకెట్లను శరీరంలోకి ఎలా ఎక్కించుకుందన్నది తెలియాల్సి ఉంది. మూసా ఇంతవరకు ఎక్కడెక్కడ ప్రయాణించిందన్న జాబితా పోలీసులకు చిక్కింది. మూసా ముసీక ఈ నెల 23న దక్షిణాఫ్రికాలోని జొహాన్నెస్‌బర్గ్ నుంచి బయలుదేరింది. అక్కడి నుంచి దుబాయ్‌కి వచ్చిన ఆమె అక్కడ ఒక రోజు ఉండి బ్రెజిల్‌కు వెళ్లింది. బ్రెజిల్ నుంచి తిరిగి దుబాయ్‌కి వచ్చి ఆదివారం తెల్లవారుజామున హైదరాబాద్‌కు వచ్చింది. దుబాయ్‌లోనే ఆమె తన కడుపులోకి డ్రగ్స్ ప్యాకెట్లు పంపించి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. హైదరాబాద్‌లో మూసా ఎవరిని కలవనుందన్న విషయం తెలిస్తే కేసు చిక్కుముడి వీడినట్లేనని భావిస్తున్నారు. మూసా కలిసేది.. ఆఫ్రికన్లనేనా.. లేదా ఇండియన్లనా? అన్న విషయాలు విచారణలో తేలనున్నాయి.
Advertisement