తెలంగాణ ఆర్టీసీలో ఉన్నతాధికారుల బదిలీలు
ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత తెలంగాణ ఆర్టీసీలో మొదటిసారి భారీ స్థాయిలో ఉన్నతాధికారుల బదిలీలు జరిగాయి. దీర్ఘకాలం నుంచి ఒకేచోట పనిచేస్తున్న ఆర్ఎంలతోపాటు పలు విభాగాల్లోని ఉన్నతాధికారులను బదిలీ చేస్తూ టిఎస్ఆర్టీసీ జేఎండీ రమణరావు ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్‌లో పనిచేస్తున్న సీనియర్ అధికారులను జిల్లాలకు పంపి, అక్కడ పని చేస్తున్న ఉద్యోగులను హైదరాబాద్‌కు మార్చారు. హైదరాబాద్ ఆర్ఎం వెంకటేశ్వరరావు ఆదిలాబాద్‌కు అక్కడ ఆర్ఎం వెంకటేశ్వర్లును ప్రధాన కార్యాలయంలో చీఫ్ మెకానికల్ ఇంజనీర్‌గా బదిలీ చేశారు. ప్రధాన […]
ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత తెలంగాణ ఆర్టీసీలో మొదటిసారి భారీ స్థాయిలో ఉన్నతాధికారుల బదిలీలు జరిగాయి. దీర్ఘకాలం నుంచి ఒకేచోట పనిచేస్తున్న ఆర్ఎంలతోపాటు పలు విభాగాల్లోని ఉన్నతాధికారులను బదిలీ చేస్తూ టిఎస్ఆర్టీసీ జేఎండీ రమణరావు ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్‌లో పనిచేస్తున్న సీనియర్ అధికారులను జిల్లాలకు పంపి, అక్కడ పని చేస్తున్న ఉద్యోగులను హైదరాబాద్‌కు మార్చారు. హైదరాబాద్ ఆర్ఎం వెంకటేశ్వరరావు ఆదిలాబాద్‌కు అక్కడ ఆర్ఎం వెంకటేశ్వర్లును ప్రధాన కార్యాలయంలో చీఫ్ మెకానికల్ ఇంజనీర్‌గా బదిలీ చేశారు. ప్రధాన కార్యాలయంలో చీఫ్ పర్సనల్ మేనేజర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న వేణును మెదక్ ఆర్ఎంగా మార్చారు. తార్నాక ఆసుపత్రి సూపరింటిండెంట్ టి.వెంకటేశ్వరరావును చీఫ్ పర్సనల్ మేనేజర్‌గా నియమించారు. మెదక్ ఆర్ఎంను ప్రధాన కార్యాలయంలో సీటీఎం మార్కెటింగ్ అండ్ కమ్యూనికేషన్స్‌కు నియమించారు. మహబూబ్‌నగర్ ఆర్ఎం గంగాధర్‌ను రంగారెడ్డి, రంగారెడ్డి ఆర్ఎం వినోద్‌ను మహబూబ్‌నగర్ ఆర్‌ఎంగా, ఖమ్మం ఆర్ఎం అజయ్‌కుమార్‌ను చీఫ్ కంట్రోలర్ ఆఫ్ స్టోర్స్‌గా, చీఫ్ కంట్రోలర్ ఆఫ్ స్టోర్స్‌గా ఉన్నశివకుమార్‌ను ఖమ్మం ఆర్ఎంగా బదిలీ చేశారు.