మహిళలందరికీ గ్యాస్ కనెక్షన్లు

తెలంగాణలో వంటగ్యాస్ లేని మహిళలందరికీ కనెక్షన్లు ఇస్తామని, రాష్ట్రవ్యాప్తంగా దశలవారీగా 20 లక్షల కనెక్షన్లు అందచేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. గ్యాస్ కనెక్షన్లకు సంబంధించి ఇప్పటికే కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో మంజూరు ప్రక్రియ ప్రారంభించామని, రానున్న నాలుగు నెలల్లో రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికీ వంటగ్యాస్ మంజూరు చేస్తామని అన్నారు. వంటగ్యాస్ కనెక్షన్ల కోసం బడ్జెట్‌లో రూ.150 కోట్లు కేటాయించామని తెలిపారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ […]

Advertisement
Update:2015-08-29 18:37 IST
తెలంగాణలో వంటగ్యాస్ లేని మహిళలందరికీ కనెక్షన్లు ఇస్తామని, రాష్ట్రవ్యాప్తంగా దశలవారీగా 20 లక్షల కనెక్షన్లు అందచేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. గ్యాస్ కనెక్షన్లకు సంబంధించి ఇప్పటికే కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో మంజూరు ప్రక్రియ ప్రారంభించామని, రానున్న నాలుగు నెలల్లో రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికీ వంటగ్యాస్ మంజూరు చేస్తామని అన్నారు. వంటగ్యాస్ కనెక్షన్ల కోసం బడ్జెట్‌లో రూ.150 కోట్లు కేటాయించామని తెలిపారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద కేంద్రాన్ని ఒప్పించి మరో 10 లక్షల కనెక్షన్లు తెస్తున్నామని, రాష్ట్రంలోని అన్ని విద్యార్థి వసతిగృహాలు, అంగన్‌వాడీలతోపాటు మద్యాహ్న భోజన పథకం అమలుకు గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేస్తున్నామని మంత్రి ఈటెల ప్రకటించారు.

Tags:    
Advertisement

Similar News