దూకుడు పెంచుదాం: టీ.కాంగ్రెస్
ప్రజావ్యతిరేక విధానాలు అనుసరిస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వంపై దూకుడు పెంచాలని కాంగ్రెస్ నేతలు నిర్ణయించారు. చీప్ లిక్కర్, ప్రాజెక్టుల రీ డిజైన్, ధరల పెరుగుదలపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేయాలని నిర్ణయించారు. అందుకోసం వారం రోజుల్లో తగిన ప్రణాళికను సిద్ధం చేయనున్నారు. గాంధీభవన్‌లో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో నేతలు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. ప్రభుత్వం రాష్ట్రాన్ని మద్యంలో ముంచి తేల్చి ప్రజలను జీవచ్ఛవాల్లా మారుస్తోందని నేతలు ఆరోపించారు. వాటాల కోసం ప్రాజెక్టుల డిజైన్లు మారుస్తున్నారని ఆరోపించారు. […]
ప్రజావ్యతిరేక విధానాలు అనుసరిస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వంపై దూకుడు పెంచాలని కాంగ్రెస్ నేతలు నిర్ణయించారు. చీప్ లిక్కర్, ప్రాజెక్టుల రీ డిజైన్, ధరల పెరుగుదలపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేయాలని నిర్ణయించారు. అందుకోసం వారం రోజుల్లో తగిన ప్రణాళికను సిద్ధం చేయనున్నారు. గాంధీభవన్‌లో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో నేతలు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. ప్రభుత్వం రాష్ట్రాన్ని మద్యంలో ముంచి తేల్చి ప్రజలను జీవచ్ఛవాల్లా మారుస్తోందని నేతలు ఆరోపించారు. వాటాల కోసం ప్రాజెక్టుల డిజైన్లు మారుస్తున్నారని ఆరోపించారు. పలు సమస్యలపై ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహిస్తామని వారు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క, సీఎల్‌పీ నేత జానారెడ్డితోపాటు మాజీ మంత్రులు గీతారెడ్డి, శ్రీధర్ తదితర్లు పాల్గొన్నారు.