లాక‌ప్‌డెత్ కేసులో పోలీసుల‌పై ఎఫ్ఐఆర్  

 గుజ‌రాత్‌లో లాక‌ప్‌డెత్‌కు గురైన శ్వేతంగ్ ప‌టేల్ (32) కేసులో 9 మంది పోలీస్ అధికారులపై ఎఫ్ఐఆర్ న‌మోదైంది. ప‌టేల్ రిజ‌ర్వేష‌న్ కోటా కోసం జ‌రిగిన ఆందోళ‌న‌లో పోలీసులు అత‌డిని అరెస్ట్ చేశారు. అయితే పోలీస్ విచార‌ణ‌లోనే అత‌ను మ‌ర‌ణించాడు. దీనిపై సీఐడి విచార‌ణ జ‌ర‌పాల‌ని హైకోర్టు ఆదేశించ‌డంతో అధికారులు 9 మంది పోలీసుల‌పై కేసు న‌మోదు చేశారు. వారిలో ఇద్ద‌రు ఇన్స్‌పెక్ట‌ర్లు, ఇద్ద‌రు స‌బ్ఇన్స్‌పెక్ట‌ర్లు ఉన్నారు. అయితే కేసును త‌ప్పుదోవ ప‌ట్టించేందుకు అధికారులు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని ప‌టేల్ రిజ‌ర్వేష‌న్ […]

Advertisement
Update:2015-08-29 18:40 IST

గుజ‌రాత్‌లో లాక‌ప్‌డెత్‌కు గురైన శ్వేతంగ్ ప‌టేల్ (32) కేసులో 9 మంది పోలీస్ అధికారులపై ఎఫ్ఐఆర్ న‌మోదైంది. ప‌టేల్ రిజ‌ర్వేష‌న్ కోటా కోసం జ‌రిగిన ఆందోళ‌న‌లో పోలీసులు అత‌డిని అరెస్ట్ చేశారు. అయితే పోలీస్ విచార‌ణ‌లోనే అత‌ను మ‌ర‌ణించాడు. దీనిపై సీఐడి విచార‌ణ జ‌ర‌పాల‌ని హైకోర్టు ఆదేశించ‌డంతో అధికారులు 9 మంది పోలీసుల‌పై కేసు న‌మోదు చేశారు. వారిలో ఇద్ద‌రు ఇన్స్‌పెక్ట‌ర్లు, ఇద్ద‌రు స‌బ్ఇన్స్‌పెక్ట‌ర్లు ఉన్నారు. అయితే కేసును త‌ప్పుదోవ ప‌ట్టించేందుకు అధికారులు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని ప‌టేల్ రిజ‌ర్వేష‌న్ క‌మిటీ క‌న్వీన‌ర్ హార్దిక్ ప‌టేల్ ఆరోపించారు. ఉన్న‌తాధికారుల‌ను త‌ప్పించి, కిందిస్థాయి అధికారుల‌పై కేసు న‌మోదు చేసి వారిని బ‌లిప‌శువుల‌ను చేస్తున్నార‌ని ఆయ‌న అన్నారు.

Tags:    
Advertisement

Similar News