భిన్నత్వంపై దాడికి మోడీ ప్రభుత్వం కుట్ర: ఏచూరి
ప్రపంచంలోని ఏ దేశాలకూ లేని ప్రత్యేకత భారత్‌కు ఉంది. అదే భిన్నత్వంలో ఏకత్వం. అయితే, ఇప్పుడు మోడీ ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ ద్వారా భారత్‌ను హిందూ దేశంగా మార్చడానికి ప్రయత్నిస్తోందని సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోపించారు. విభిన్న మతాలు, జాతులు, కులాలు, భాషల ప్రజలు శాంతియుతంగా సహజీవనం చేస్తున్నారు. ఈ సహజీవన సామరస్యాన్ని చెడగొట్టేందుకు మోడీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కుట్ర ప్రారంభమైంది. హిందూదేశంగా మార్చాలని ఆర్ఎస్ఎస్ చేస్తున్న ప్రయత్నాలకు కేంద్రం తన వంతు సహకారాన్ని […]
Advertisement
ప్రపంచంలోని ఏ దేశాలకూ లేని ప్రత్యేకత భారత్‌కు ఉంది. అదే భిన్నత్వంలో ఏకత్వం. అయితే, ఇప్పుడు మోడీ ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ ద్వారా భారత్‌ను హిందూ దేశంగా మార్చడానికి ప్రయత్నిస్తోందని సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోపించారు. విభిన్న మతాలు, జాతులు, కులాలు, భాషల ప్రజలు శాంతియుతంగా సహజీవనం చేస్తున్నారు. ఈ సహజీవన సామరస్యాన్ని చెడగొట్టేందుకు మోడీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కుట్ర ప్రారంభమైంది. హిందూదేశంగా మార్చాలని ఆర్ఎస్ఎస్ చేస్తున్న ప్రయత్నాలకు కేంద్రం తన వంతు సహకారాన్ని అందిస్తోందని ఆయన విమర్శించారు. ఇప్పటికే విద్యారంగాన్ని కాషాయీకరణ ప్రయత్నాలు ప్రారంభించిందని అది దేశానికే ప్రమాదమని ఆయన అన్నారు. హైదరాబాద్‌లోని కేంద్రీయ విశ్వవిద్యాలయంలో జరిగిన విద్యా కాషాయీకరణ – విశ్వవిద్యాలయాల్లో ప్రజాస్వామ్య హక్కులపై దాడి సదస్సు ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా లౌకికవాద శక్తులు ఏకీకృతమవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. లౌకికవాద స్ఫూర్తికి విఘాతం కల్గించే ఏ మతశక్తులనూ ఉపేక్షించమని ఆయన హెచ్చరించారు.
Advertisement