టీచర్ల బదిలీల షెడ్యూల్ విడుదల
ఏపీలో టీచర్ల బదిలీలకు సంబంధించిన షెడ్యూలును మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. ఆగస్టు 31 నుంచి సెప్టెంబరు 30 వరకూ బదిలీలు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. దీనికి సంబంధించిన విధివిధానాలను కూడా ఆయన విడుదల చేశారు. సాంకేతిక టెక్నాలజీ ఆధారంగా వెబ్‌కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నామని మంత్రి చెప్పారు. ఉపాధ్యాయుల పనితీరు ప్రామాణికంగా తీసుకుని 25 శాతం వెయిటేజీతో బదిలీలు చేపడతామని, వచ్చే ఏడాది 50 శాతం వెయిటేజీకి ప్రాధాన్యత ఇస్తామని ఆయన చెప్పారు. రాష్ట్రంలోని 2,998 పాఠశాలలను విలీనం […]
Advertisement
ఏపీలో టీచర్ల బదిలీలకు సంబంధించిన షెడ్యూలును మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. ఆగస్టు 31 నుంచి సెప్టెంబరు 30 వరకూ బదిలీలు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. దీనికి సంబంధించిన విధివిధానాలను కూడా ఆయన విడుదల చేశారు. సాంకేతిక టెక్నాలజీ ఆధారంగా వెబ్‌కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నామని మంత్రి చెప్పారు. ఉపాధ్యాయుల పనితీరు ప్రామాణికంగా తీసుకుని 25 శాతం వెయిటేజీతో బదిలీలు చేపడతామని, వచ్చే ఏడాది 50 శాతం వెయిటేజీకి ప్రాధాన్యత ఇస్తామని ఆయన చెప్పారు. రాష్ట్రంలోని 2,998 పాఠశాలలను విలీనం చేసినట్లు ఆయన చెప్పారు. సెప్టెంబరు 5న విశాఖపట్టణంలో గురుపూజోత్సవం నిర్వహిస్తామని, ప్రకాశం జిల్లాలో సెప్టెంబరు 8వ తేదీన అక్షరాస్యత దినోత్సవాన్నినిర్వహిస్తామని ఆయన చెప్పారు.
Advertisement