చరిత్ర, ఆర్థికాంశాలపై పట్టు ఉండాలి
గ్రూపు పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్ధులు తెలంగాణ చరిత్ర, ఆర్థికాంశాలపై మంచి పట్టు సాధించాలని జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరాం సూచించారు. ప్రభుత్వ రంగంలోని వివిధ సంస్థల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వరుస నోటిఫికేషన్‌లు విడుదల చేస్తున్న నేపథ్యంలో నల్లగొండలో గ్రూపు పరీక్షల అవగాహనా సదస్సు జరిగింది. సదస్సుకు ప్రొ.కోదండరాం ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. గ్రూపు పరీక్షల్లో నూతనంగా తెలంగాణ చరిత్రను సిలబస్‌లో చేర్చడం వల్ల అభ్యర్ధులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. […]
Advertisement
గ్రూపు పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్ధులు తెలంగాణ చరిత్ర, ఆర్థికాంశాలపై మంచి పట్టు సాధించాలని జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరాం సూచించారు. ప్రభుత్వ రంగంలోని వివిధ సంస్థల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వరుస నోటిఫికేషన్‌లు విడుదల చేస్తున్న నేపథ్యంలో నల్లగొండలో గ్రూపు పరీక్షల అవగాహనా సదస్సు జరిగింది. సదస్సుకు ప్రొ.కోదండరాం ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. గ్రూపు పరీక్షల్లో నూతనంగా తెలంగాణ చరిత్రను సిలబస్‌లో చేర్చడం వల్ల అభ్యర్ధులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మన కళ్లముందున్న చరిత్రను పరిశీలిస్తే పరీక్షలను అవలీలగా జయించగలం. మన ప్రాంత చరిత్ర తెలియని పక్షంలో ఉద్యోగానికి న్యాయం చేయలేం. కనుక గ్రూపు పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు ఈ అంశాలపై దృష్టి కేంద్రీకరించాలని ఆయన సూచించారు. ఈ అవగాహనా సదస్సులో పలువురు ప్రొఫెసర్లు, రాజకీయనాయకులు, విద్యార్ధులు పాల్గొన్నారు.
Advertisement