గుంటూరుకు చిన్న నీటిపారుదల శాఖ: సీఈ సాబ్‌జాన్
జలవనరుల శాఖకు చెందిన చిన్న నీటిపారుదల రాష్ట్ర కార్యాలయం గుంటూరులో వచ్చేసింది. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట ఉన్న జలవనరుల శాఖ గుంటూరు సర్కిల్ కార్యాలయ నూతన భవనంలోని రెండో అంతస్తులో చీఫ్ ఇంజినీర్ ఎం.డీ. సాబ్‌జాన్ కొబ్బరికాయ కొట్టి కార్యాలయ ప్రవేశం చేశారు. దీంతో చిన్న నీటిపారుదల శాఖకు గుంటూరులో తొలి హెచ్‌వోడీ ఏర్పాటైంది. ఆఫీసు మొత్తాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి తరలిస్తామని అధికారవర్గాలు తెలిపాయి. విజయవాడకే పరిమితమైన జలవనరుల శాఖ హెచ్‌వోడీలలో ఒకటి […]
Advertisement
జలవనరుల శాఖకు చెందిన చిన్న నీటిపారుదల రాష్ట్ర కార్యాలయం గుంటూరులో వచ్చేసింది. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట ఉన్న జలవనరుల శాఖ గుంటూరు సర్కిల్ కార్యాలయ నూతన భవనంలోని రెండో అంతస్తులో చీఫ్ ఇంజినీర్ ఎం.డీ. సాబ్‌జాన్ కొబ్బరికాయ కొట్టి కార్యాలయ ప్రవేశం చేశారు. దీంతో చిన్న నీటిపారుదల శాఖకు గుంటూరులో తొలి హెచ్‌వోడీ ఏర్పాటైంది. ఆఫీసు మొత్తాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి తరలిస్తామని అధికారవర్గాలు తెలిపాయి. విజయవాడకే పరిమితమైన జలవనరుల శాఖ హెచ్‌వోడీలలో ఒకటి గుంటూరు ఇరిగేషన్ సర్కిల్ కార్యాలయంలో ప్రారంభమైంది. ఒక చీఫ్ ఇంజినీర్ (సీఈ), ఇద్దరు డిప్యూటీ సీఈలు, ఆరుగురు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, 15 మంది ఏఈఈలు, 20 మంది గుమాస్తాలు ఉండే కార్యాలయాన్ని దశల వారీగా గుంటూరుకు పూర్తిస్థాయిలో తరలిస్తారు. తొలి దశలో హైదరాబాద్‌లో కార్యాలయాన్ని కొనసాగిస్తూ కొంతమంది ఇంజనీర్లు, గుమాస్తాలను ఇక్కడ ఆఫీసులో పోస్టింగ్ చేస్తారు. దశలవారీగా కార్యాలయం మొత్తం ఇక్కడికి తీసుకొచ్చేస్తారు. సీఈ మాత్రం ఇకపై గుంటూరులోనే అందుబాటులో ఉంటూ కార్యకలాపాలను కొనసాగిస్తారని అధికారవర్గాలు తెలిపాయి.
Advertisement