ఏపీలో 'నారా'యణ మంత్రం
ఏపీలో ఏకో నారాయణ.. ఏపీ `ముఖ్య` మంత్రి నారాయణ నారావారి జమానాలో అంతా నారాయణ మంత్రమే. పేరుకే కేబినెట్. అంతా చైనా (చైతన్య, నారాయణ సంస్థల అధినేత) నారాయణే. మంత్రులందరిలోముఖ్య మంత్రిగా నారా వారి కేబినెట్‌లో నారాయణ అగ్రాసనం దక్కించుకున్నారు. కారణం ఏదైనా నారాబాబుకు అత్యంత నమ్మకస్తుడు నారాయణ అనేది అనతికాలంలోనే మంత్రులంతా గ్రహించేశారు. దీనికనుగుణంగానే.. శాఖలకు అతీతంగా నారాయణ విస్తరించారు. పేరుకే నారాయణ మున్సిపల్ శాఖా మంత్రి. శాఖోపశాఖలుగా విస్తరించిన నారాయణ హవా.. శాఖలకు అతీతమైపోయిందని సాటి […]
Advertisement
ఏపీలో ఏకో నారాయణ.. ఏపీ 'ముఖ్య' మంత్రి నారాయణ
నారావారి జమానాలో అంతా నారాయణ మంత్రమే. పేరుకే కేబినెట్. అంతా చైనా (చైతన్య, నారాయణ సంస్థల అధినేత) నారాయణే. మంత్రులందరిలోముఖ్య మంత్రిగా నారా వారి కేబినెట్‌లో నారాయణ అగ్రాసనం దక్కించుకున్నారు. కారణం ఏదైనా నారాబాబుకు అత్యంత నమ్మకస్తుడు నారాయణ అనేది అనతికాలంలోనే మంత్రులంతా గ్రహించేశారు. దీనికనుగుణంగానే.. శాఖలకు అతీతంగా నారాయణ విస్తరించారు. పేరుకే నారాయణ మున్సిపల్ శాఖా మంత్రి. శాఖోపశాఖలుగా విస్తరించిన నారాయణ హవా.. శాఖలకు అతీతమైపోయిందని సాటి మంత్రులే వాపోతున్నారు. దేవాదాయశాఖ మంత్రి సమీక్షించాల్సిన పుష్కరాల పనులను నారాయణ టేకప్ చేసినప్పుడే దేవాదాయశాఖా మంత్రి నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. అయినా డోన్ట్ కేర్. పుష్కరాలకు వచ్చిన వేలకోట్లు నిధుల పందేరం, విధుల కేటాయింపు అంతా తానై నారాయణే నిర్వహించారు.
భూ సమీకరణ మంత్రం ..సేకరణ తంత్రం
ఏపీలో రాజధాని నిర్మాణం కోసం ముందు భూ సమీకరణ చేశారు. అయితే ఈ పనులను పర్యవేక్షించాల్సిన శాఖ రెవెన్యూ పరిధిలో ఉంది. రెవెన్యూ మంత్రే భూసమీకరణ, సేకరణ ఏర్పాట్లు చేయాల్సి ఉంది. అయితే రెవెన్యూ మంత్రి, డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తికి మాట మాత్రంగానైనా చెప్పకుండా అన్నీ తానై, అంతా తానై నారాయణ చక్కబెట్టేశారట. రాజధాని భూ మంత్రం వికటించడంతో ఇప్పుడు ఒక్కో నిరసన గళం వినిపిస్తోంది. అయితే తన శాఖను నారాయణ చక్కబెట్టడంపై అసంతృప్తిని బయటపెట్టకుండా రైతుల సాగు భూములను సేకరించి రాజధానిని నిర్మించడం తనకు ఇష్టం లేదని, తాను మొదటి నుంచి భూసేకరణకు వ్యతిరేకమని ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి స్పష్టం చేశారు. తాను మొదటి నుంచి రైతుల భూమి సేకరణకు వ్యతిరేకం కాబట్టే.. ఈ అంశానికి దూరంగా ఉన్నానని చెప్పారు. అందుకే నా రెవెన్యూ శాఖలో జరగాల్సిన భూ సేకరణ, మున్సిపల్ మంత్రి నారాయణ ఆధ్వర్యంలో జరుగుతోందని చెప్పారు. తాను ఇక అప్పటి నుంచి ఈ అంశానికి దూరంగా ఉంటున్నానని వివరించారు.
ఇది నారాయణ 'నోటి'ఫికేషన్
రాజధాని కోసం భూములు సేకరించడం ఏపీ సీఎం చంద్రబాబుకు అస్సలు ఇష్టంలేదట. అయితే 21వ శతాబ్దపు కలల రాజధానిని నిర్మించే క్రమంలో తానే అత్యుత్సాహంతో భూ సేకరణ నోటిఫికేషన్ ఇచ్చానని నారాయణ చెబుతున్నారు. అంటే నారాయణ ఏ పనీ చేసినా సీఎం నారావారికి చెప్పనక్కర్లేదనేది ఈ అంశం స్పష్టం చేస్తోంది. మరోవైపు నారాయణ నోటి మాటే భూసేకరణ నోటిఫికేషన్ అయిందనేది కూడా ఏపీ జనాలకు అర్థమైంది. ప్రపంచానికే పాఠాలు నేర్పానని బీరాలు పలికే ఏపీ సీఎం చంద్రబాబుకు తెలియకుండా రాజధాని భూముల సేకరణకు..తనకు సంబంధంలేని రెవెన్యూ శాఖ వ్యవహారాల్లో చొరబడి మరీ నోటిఫికేషన్ జారీకి నారాయణ తెగబడ్డారంటే.. ఏపీ కేబినెట్లో ఆయన స్థాయేంటో తెలియజేస్తోంది. అందుకే నారాయణ ఏ శాఖ వ్యవహారం చక్కబెట్టినా ఏ ఒక్క మంత్రీ నోరు మెదపడంలేదట. చివరికి బాబుకు తెలియకుండా జారీ చేశాననని నారాయణ చెబుతున్న నోటిఫికేషన్ పవన్ కల్యాణ్ హెచ్చరికతో వెనక్కి తీసుకుంటున్నామని తనకు తానే ప్రకటించారు నారాయణ. నారా వారి జమానాలో నారాయణ మంత్రం ఏ రేంజ్ లో ఉందో చూసిన మంత్రులకు దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అవుతోందట.
Advertisement