ప్రజల ఆకాంక్షలకు అద్దం పట్టిన బంద్‌ సక్సెస్: జగన్‌

ప్రత్యేక హోదాకు డిమాండు చేస్తూ తాము ఇచ్చిన పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలు బంద్‌ విజయవంతం చేశారని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్‌. జగన్మోహనరెడ్డి అన్నారు. హోదా విషయాన్ని ఇంతటితో వదలమని, ఈ విషయంపై అసెంబ్లీలో పోరాడతామని, పార్లమెంటులో కేంద్రాన్ని నిలదీస్తామని జగన్‌ తెలిపారు. ప్రత్యేక హోదాపై ప్రజల ఆకాంక్షకు బంద్‌ విజయవంతమే ఒక నిదర్శనమని ఆయన అన్నారు. బంద్‌ సందర్బంగా పోలీసులు నిరంకుశంగా ప్రవర్తించారని, 40 మంది ఎమ్మెల్యేలను అరెస్ట్‌ చేశారని, వేలాది మంది కార్యకర్తలను, […]

Advertisement
Update:2015-08-29 14:44 IST
ప్రత్యేక హోదాకు డిమాండు చేస్తూ తాము ఇచ్చిన పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలు బంద్‌ విజయవంతం చేశారని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్‌. జగన్మోహనరెడ్డి అన్నారు. హోదా విషయాన్ని ఇంతటితో వదలమని, ఈ విషయంపై అసెంబ్లీలో పోరాడతామని, పార్లమెంటులో కేంద్రాన్ని నిలదీస్తామని జగన్‌ తెలిపారు. ప్రత్యేక హోదాపై ప్రజల ఆకాంక్షకు బంద్‌ విజయవంతమే ఒక నిదర్శనమని ఆయన అన్నారు. బంద్‌ సందర్బంగా పోలీసులు నిరంకుశంగా ప్రవర్తించారని, 40 మంది ఎమ్మెల్యేలను అరెస్ట్‌ చేశారని, వేలాది మంది కార్యకర్తలను, మహిళలను అదుపులోకి తీసుకున్నారని వైఎస్‌ జగన్‌ ఆరోపించారు. అసలు చంద్రబాబు ప్రత్యేక హోదాకు అనుకూలమా, వ్యతిరేకమా… ఆయన హోదా కావాలనుకుంటున్నారా లేక వద్దనుకుంటున్నారా అనే అంశంపై స్పష్టత లేదని జగన్‌ ఆరోపించారు. తాను ప్రత్యేక హోదాకు వ్యతిరేకమన్న దోరణి ఆయన మాటల్లో, ప్రవర్తనలో కనపడుతుందని ఆయన అన్నారు. ప్రత్యేక హోదాపై వచ్చే లాభాలు తెలిసి కూడా ఆయన ఆ విషయాన్ని విస్మరిస్తున్నారంటే చంద్రబాబును ఏమనుకోవాలని ప్రశ్నించారు.
రాష్ట్రానికి ప్రత్యేక హోదా డిమాండు చేస్తూ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు శనివారం ఆంధ్రప్రదేశ్‌లో బంద్‌ ప్రశాంతంగా ముగిసింది. ఏపీఎస్‌ ఆర్టీసీ డిపోల వద్ద ఈ పార్టీతోపాటు వామపక్షాలు ధర్నాకు దిగుతూ బస్సులు బయటకు రాకుండా ప్రయత్నించారు. విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో ముందు జాగ్రత్త చర్యగా 250 మంది నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని నిర్భందించారు. బంద్‌ను విజయవంతం చేయాల్సిందిగా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్‌. జగన్‌ పిలుపు ఇవ్వడంతో కొన్నిచోట్ల బంద్‌ పూర్తిగాను, మరికొన్నిజిల్లాల్లో పాక్షికంగాను జరిగింది . ముఖ్యమైన నాయకులందరినీ పోలీసులు అదుపులోకి తీసుకోవడమో… లేక గృహ నిర్భంధంలో ఉంచడమో చేయడంతో కార్యకర్తలకు నాయకత్వ లోపం కనిపించింది. అయినా వీధుల్లో తిరుగుతూ బంద్‌ చేయించడంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌, వామపక్షాల కార్యకర్తలు నిమగ్నమయ్యారు. కొన్ని కీలక ప్రాంతాల్లో ఆర్టీసీ బస్సులను నడపడం నిలిపి వేసింది. విజయవాడలోని నెహ్రూ బస్టాండు ఎదుట వైసీపీ కార్యకర్తలు ధర్నా చేశారు. వీరికి వామపక్షాలు కూడా తోడయ్యాయి. ఈ సందర్భంగా మాజీమంత్రి పార్ధసారధి, కొడాలి నాని, వంగవీటి రాధాకృష్ణలను పోలీసులు అరెస్టు చేశారు. నెల్లూరులోని ఆత్మకూరు బస్టాండు వద్ద ధర్నా చేస్తున్న వైసీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. విశాఖపట్నంలోని గాజువాక బస్సు డిపో ఎదుట వైసీపీ కార్యకర్తల ధర్నా చేశారు. వైసీపీ నేత ఉమాశంకర్‌ సహా పలువురిని అరెస్టు చేశారు. విశాఖ సిటీలో బస్సులు యథావిధిగా నడిచాయి. గుంటూరులో ఆర్టీసీ బస్టాండు ఎదుట ఎమ్మెల్యే ముస్తాఫా ఆధ్వర్యంలో ధర్నా చేస్తుండగా పోలీసులు అరెస్టు చేశారు. విజయనగరంలో ఆర్టీసీ డిపోల వద్ద వైసీపీ కార్యకర్తల ధర్నాతో బస్సులు నిలచిపోయాయి. తూర్పు గోదావరి జిల్లాలో బంద్‌ పాక్షికంగా సాగింది. తూర్పుగోదావరి జిల్లాలో ఆర్టీసీ బస్సుల రాకపోకలు నిలచిపోయాయి. కొన్నిచోట్ల హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి. వామపక్షాలు కూడా ఈ బంద్‌కు మద్దతివ్వడం, స్వయంగా పాల్గొని విజయవంతం చేయడానికి ప్రయత్నించడంతో ప్రధానరోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపించాయి. పోలీసులు ముందుజాగ్రత్త చర్యగా వైసీపీ నేతలను హౌస్‌ అరెస్టు చేశారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కొన్ని ప్రాంతాల్లో పోలీసు బందోబస్తుతో బస్సులను నడిపారు.
మారని మనిషి చంద్రబాబు: పి. మధు
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వైసీపీ ఇచ్చిన రాష్ట్ర బంద్ మద్దతుగా వామపక్షాలు విజయవాడలోని విజయవాడ లెనిన్ సెంటర్ నుండి ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో పాల్గొన్న మధు మాట్లాడుతూ… రాష్ట్రంలో బంద్ ప్రశాంతంగా జరుగుతుంటే సహకరిచడం పోయి అరెస్టు చేసి ప్రభుత్వ నిరకుశత్వాన్ని తెలియజేస్తోందని మండి పడ్డారు. వామపక్ష నేతలను హౌస్ అరెస్టు చేసి భయాందోళనలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు మారిన మనిషి కాదు.. మారనిమనిషే అని ఎద్దేవా చేశారు. ఏపీకి ప్రత్యేక హోదాపై బిజెపి తెలుగుదేశం పార్టీలు ఏపీ ప్రజలకు నమ్మక ద్రోహం చేశాయని సీపీఎం నేత బాబూరావు ఆరోపించారు.
Tags:    
Advertisement

Similar News