Wonder World 9
పెరూలో కొట్టుకునే పండగ! పెరూలోని ఓ పట్టణంలో ప్రతి ఏటా డిసెంబర్ 25న ఓ విచిత్రమైన పండుగను జరుపుకుంటుంటారు. దానిపేరు టకనాకుయ్. ఆ ఏడాదిలో తమకు ఎవరెవరితో ఎలాంటి గొడవలున్నాయో, ఎలాంటి ఇబ్బందులున్నాయో గుర్తుచేసుకుంటూ వాటిని అరచి చెబుతూ ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకుంటారు. కలియబడి కొట్టేసుకుంటారు. ఇదంతా ముగిసిన తర్వాత అంతా అక్కడితో వదిలేస్తారు. పీకలవరకూ తాగి బాగా ఎంజాయ్ చేస్తారు. కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతారు. విచిత్రమేమిటంటే ఈ కార్యక్రమంలో పురుషులు, మహిళలు, పిల్లలు […]
పెరూలో కొట్టుకునే పండగ!
పెరూలోని ఓ పట్టణంలో ప్రతి ఏటా డిసెంబర్ 25న ఓ విచిత్రమైన పండుగను జరుపుకుంటుంటారు. దానిపేరు టకనాకుయ్. ఆ ఏడాదిలో తమకు ఎవరెవరితో ఎలాంటి గొడవలున్నాయో, ఎలాంటి ఇబ్బందులున్నాయో గుర్తుచేసుకుంటూ వాటిని అరచి చెబుతూ ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకుంటారు. కలియబడి కొట్టేసుకుంటారు. ఇదంతా ముగిసిన తర్వాత అంతా అక్కడితో వదిలేస్తారు. పీకలవరకూ తాగి బాగా ఎంజాయ్ చేస్తారు. కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతారు. విచిత్రమేమిటంటే ఈ కార్యక్రమంలో పురుషులు, మహిళలు, పిల్లలు ఇలా అందరూ ఆనందంగా పాల్గొంటారు.
—————————————————————————————————————————————–
డ్రగ్స్‌ను కనిపెట్టే స్ట్రాలు
ఇజ్రాయిలీ శాస్త్రవేత్తలు ఓ అరుదైన స్ట్రాను కనిపెట్టారు. దీని ప్రత్యేకత ఏమిటంటే మనం ఏదైనా పానీయం తీసుకునేటపుడు అందులో నిషిద్ధ మాదకద్రవ్యాలుంటే అది కనిపెట్టేస్తుంది. ఆ పానీయంలో ఈ స్ట్రాను ఉంచగానే దాని పై కొనవైపు ఉండే ఓ బల్బు వెలుగుతుంది. బల్బు వెలగకపోతే మీరు నిశ్చింతగా ఆ పానీయాన్ని తాగేయవచ్చు.
—————————————————————————————————————————————–
అమెరికన్లకు దైవభక్తి ఎక్కువే!
అమెరికాలో పావువంతుమంది తమ తమ అభిమాన స్పోర్ట్స్ టీములు గెలవాల్సిందిగా దేవుడిని ప్రార్ధిస్తుంటారని ఇటీవలి ఓ సర్వే వెల్లడించింది. అమెరికాలోని దాదాపు సగం జనాభాను సర్వే చేశారు.
ఆటల్లో .. ముఖ్యంగా ఫుట్‌బాల్ మ్యాచ్‌ల్లో విజేతను దేవుడే నిర్ణయిస్తాడని పావు శాతం మంది జనాభా నమ్ముతున్నారట.