హోదా రాదనుకుంటే ఏం చేయాలో ఆలోచిద్దాం: పవన్‌

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా విషయంలో భావోద్వేగాలకు పోకుండా ఇంకొంత కాలం వేచి ఉండాలని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ హితవు చెప్పారు. హోదా రాదని నమ్మకం కలిగినపుడు, అప్పటికీ న్యాయం జరగని పక్షంలో దానిని ఎలా సాధించుకోవాలో ఆలోచిద్దామని ఆయన తెలిపారు. తొలిసారిగా ఆయన ఏపీకి ప్రత్యేక హోదాపై ట్విట్టర్‌లో తన సందేశాన్ని పొందుపరిచారు. గతంలో తాను ప్రధానిని కలిసినపుడు విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్‌కి జరిగిన అన్యాయాన్ని, ప్రజలకి తగిలిన గాయాన్ని వివరించానని, ఆయన విషయాలన్నీ అర్ధం […]

Advertisement
Update:2015-08-28 16:18 IST

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా విషయంలో భావోద్వేగాలకు పోకుండా ఇంకొంత కాలం వేచి ఉండాలని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ హితవు చెప్పారు. హోదా రాదని నమ్మకం కలిగినపుడు, అప్పటికీ న్యాయం జరగని పక్షంలో దానిని ఎలా సాధించుకోవాలో ఆలోచిద్దామని ఆయన తెలిపారు. తొలిసారిగా ఆయన ఏపీకి ప్రత్యేక హోదాపై ట్విట్టర్‌లో తన సందేశాన్ని పొందుపరిచారు. గతంలో తాను ప్రధానిని కలిసినపుడు విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్‌కి జరిగిన అన్యాయాన్ని, ప్రజలకి తగిలిన గాయాన్ని వివరించానని, ఆయన విషయాలన్నీ అర్ధం చేసుకున్నారని తెలిపారు. అందుకే ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం సానుకూల నిర్ణయం తీసుకుంటుందని తాను భావిస్తున్నానని ఆయన అన్నారు. ఏపీకి హోదా ఇప్పటికే రావాల్సి ఉన్నప్పటికీ… దేశ సమగ్రతను దృష్టిలో పెట్టుకుని ప్రధాని నిర్ణయాలు తీసుకోవలసి ఉన్నందున కొంచెం ఆలస్యం కావచ్చని, అంతమాత్రాన భావోద్వేగాలకు గురయి ఆత్మహత్యలకు పాల్పడడం మంచిది కాదని, మీ కోసం కుటుంబాలు ఉంటాయన్న విషయాన్ని మరిపోవద్దని పవన్‌ హితవు చెప్పారు.
రాజధాని నిర్మాణంలో భూసేకరణ నోటిఫికేషన్‌ ఉపసంహరించుకున్నందుకు రాష్ట్ర మంత్రులు పత్తిపాటి పుల్లారావు, నారాయణలకు పవన్‌ కల్యాణ్‌ కృతజ్ఞతలు చెప్పారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన అభిప్రాయాన్ని గౌరవించి సానూకూలంగా స్పందించినందుకు, రైతుల మనోభావాలను సానుభూతితో పరిశీలించినందుకు ఆయన అభినందనలు తెలిపారు.

Tags:    
Advertisement

Similar News