నేటి నిజాం కేసీఆర్‌: నాగం విమర్శ

తెలంగాణలో నిజాంను మించిన పాలన కొనసాగుతోందని బీజేపీ నేత నాగం జనార్ధన్ రెడ్డి అన్నారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ… సెప్టెంబర్‌ 17కు సీఎం కేసీఆర్ కొత్త నిర్వచనం చెబుతున్నారని, ఒక వర్గానికి భయపడే ఆయన కొత్త వేషాలేస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. అలాగే… వైఎస్‌ ఆత్మ కేసీఆర్ ప్రభుత్వాన్ని నడిపిస్తోందని, వాటర్‌గ్రిడ్‌ పథకంలో కొంతమందికే టెండర్లు ఇవ్వడంలో ఆంతర్యమేంటని నాగం ప్రశ్నించారు. జలయజ్ఞంలో జరిగిన అవినీతి వాటర్‌గ్రిడ్‌లోనూ కొనసాగుతోందని, వాటర్‌గ్రిడ్‌ పథకంలో ఆంధ్రా కాంట్రాక్టర్లకే పనులు అప్పగిస్తున్నారన్నారు. అలాగే […]

Advertisement
Update:2015-08-27 19:02 IST
తెలంగాణలో నిజాంను మించిన పాలన కొనసాగుతోందని బీజేపీ నేత నాగం జనార్ధన్ రెడ్డి అన్నారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ… సెప్టెంబర్‌ 17కు సీఎం కేసీఆర్ కొత్త నిర్వచనం చెబుతున్నారని, ఒక వర్గానికి భయపడే ఆయన కొత్త వేషాలేస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. అలాగే… వైఎస్‌ ఆత్మ కేసీఆర్ ప్రభుత్వాన్ని నడిపిస్తోందని, వాటర్‌గ్రిడ్‌ పథకంలో కొంతమందికే టెండర్లు ఇవ్వడంలో ఆంతర్యమేంటని నాగం ప్రశ్నించారు. జలయజ్ఞంలో జరిగిన అవినీతి వాటర్‌గ్రిడ్‌లోనూ కొనసాగుతోందని, వాటర్‌గ్రిడ్‌ పథకంలో ఆంధ్రా కాంట్రాక్టర్లకే పనులు అప్పగిస్తున్నారన్నారు. అలాగే తెలంగాణ అమరుల కోసం వెబ్‌సైట్ రూపొందిస్తున్నామన్నారు.​
Tags:    
Advertisement

Similar News