అన్నదాతలపై విరిగిన లాఠీ-మమత ప్రభుత్వ ఆరాచకం
వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధరతోపాటు పలు డిమాండ్ల సాధన కోసం శాంతియుతంగా ధర్నా చేస్తున్న అన్నదాతలపై పోలీసులు లాఠీలతో విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ సంఘటన గురువారం కోల్‌కత్తాలో చోటు చేసుకుంది. దీంతో నగరం రణరంగంగా మారింది. వరదల వల్ల నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించడంతో పాటు నిత్యావసర ధరలు తగ్గించాలని, భూసేకరణ ఆర్డినెన్స్‌ను విరమించుకోవాలని తదితర 17 డిమాండ్లతో వామపక్ష రైతు సంఘాలు చలో సెక్రటేరియట్‌ను చేపట్టాయి. లక్షలాదిమంది రైతులు ర్యాలీగా సచివాలయంకు వెళుతుండగా పోలీసులు […]
Advertisement
వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధరతోపాటు పలు డిమాండ్ల సాధన కోసం శాంతియుతంగా ధర్నా చేస్తున్న అన్నదాతలపై పోలీసులు లాఠీలతో విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ సంఘటన గురువారం కోల్‌కత్తాలో చోటు చేసుకుంది. దీంతో నగరం రణరంగంగా మారింది. వరదల వల్ల నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించడంతో పాటు నిత్యావసర ధరలు తగ్గించాలని, భూసేకరణ ఆర్డినెన్స్‌ను విరమించుకోవాలని తదితర 17 డిమాండ్లతో వామపక్ష రైతు సంఘాలు చలో సెక్రటేరియట్‌ను చేపట్టాయి. లక్షలాదిమంది రైతులు ర్యాలీగా సచివాలయంకు వెళుతుండగా పోలీసులు వారిపై విచక్షణరహితంగా లాఠీలతో దాడి చేశారు. అన్నదాతల రక్తం కళ్ల చూసారు. వామపక్షనేతలు, రైతులను బలవంతంగా అరెస్ట్ చేశారు. అయితే, పోలీసుల దాడి రైతుల ఆత్మస్థైర్యాన్నిమాత్రం దెబ్బతీయలేదు. లాఠీచార్జీలో తీవ్రంగా గాయపడినా, లెక్కచేయకుండా రైతులు తిరిగి ఒక్క చోట సమావేశమయ్యారు. ప్రభుత్వ నిరంకుశ విధానానికి వ్యతిరేకంగా నాలుగు గంటల పాటు శాంతియుత ధర్నా చేశారు. రైతుల పోరాటానికి భయపడిన పోలీసులు అరెస్ట్ చేసిన నేతలను, రైతులను విడిచి పెట్టారు. అయితే, రైతుల పట్ల పోలీసుల అమానుష ప్రవర్తన పట్ల బెంగాల్‌తో పాటు దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.
Advertisement