అర్చకులకు తెలంగాణ ప్రభుత్వం అభయం
అర్చకుల సమ్మెపై ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టి సారించారని, వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి. దేవాదాయ శాఖ అర్చకులు, ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నట్లుగా 65-ఏ అమలుపై సాధ్యాసాధ్యాలను పరిశీలించాల్సిందిగా అధికారులను సీఎం ఆదేశించారు. ఈ ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, రాష్ట్ర దేవాదాయ శాఖ సెక్రటరీ శివశంకర్ రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారు. అర్చకుల సమ్మెపై యాదాద్రి అర్చక సమాఖ్య అధ్యక్షుడు రంగాచార్య అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం […]
Advertisement
అర్చకుల సమ్మెపై ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టి సారించారని, వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి. దేవాదాయ శాఖ అర్చకులు, ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నట్లుగా 65-ఏ అమలుపై సాధ్యాసాధ్యాలను పరిశీలించాల్సిందిగా అధికారులను సీఎం ఆదేశించారు. ఈ ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, రాష్ట్ర దేవాదాయ శాఖ సెక్రటరీ శివశంకర్ రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారు. అర్చకుల సమ్మెపై యాదాద్రి అర్చక సమాఖ్య అధ్యక్షుడు రంగాచార్య అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అర్చకులు జీతాలను పెంచిందని, అలాగే వారి సమస్యలను కూడా పరిష్కరిస్తోందని ఆయన అన్నారు. ఉద్యోగులు వేచి చూసే ధోరణితో వ్యవహరించాలని ఆయన సూచించారు.
Advertisement