పాక్‌ ఉగ్రవాది సజాద్‌కు 5 రోజుల పోలీసు కస్టడీ

పాకిస్థాన్‌కు చెందిన మరో ఉగ్రవాది సజాద్ అహ్మద్‌కు కోర్టు ఐదు రోజుల పోలీస్‌ కస్టడీ విధించింది. సజాద్‌ను భారత సైన్యం గురువారం పట్టుకున్న విషయం విదితమే. సజాద్ అహ్మద్‌ను శుక్రవారం జమ్మూకాశ్మీర్ కోర్టులో హాజరు పరిచారు. అహ్మద్‌కు కోర్టు ఐదు రోజుల పోలీసు కస్టడీకి ఇచ్చింది. అహ్మద్‌ను పాక్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌కు చెందిన ముజఫర్‌గఢ్ వాసిగా సైన్యం గుర్తించింది. అహ్మద్ నుంచి రెండు ఏకే 47 రైఫిళ్లు, జీపీఎస్ పరికరం స్వాధీనం చేసుకున్నారు. నెల వ్యవధిలోనే ప్రాణాలతో […]

Advertisement
Update:2015-08-28 11:14 IST
పాకిస్థాన్‌కు చెందిన మరో ఉగ్రవాది సజాద్ అహ్మద్‌కు కోర్టు ఐదు రోజుల పోలీస్‌ కస్టడీ విధించింది. సజాద్‌ను భారత సైన్యం గురువారం పట్టుకున్న విషయం విదితమే. సజాద్ అహ్మద్‌ను శుక్రవారం జమ్మూకాశ్మీర్ కోర్టులో హాజరు పరిచారు. అహ్మద్‌కు కోర్టు ఐదు రోజుల పోలీసు కస్టడీకి ఇచ్చింది. అహ్మద్‌ను పాక్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌కు చెందిన ముజఫర్‌గఢ్ వాసిగా సైన్యం గుర్తించింది. అహ్మద్ నుంచి రెండు ఏకే 47 రైఫిళ్లు, జీపీఎస్ పరికరం స్వాధీనం చేసుకున్నారు. నెల వ్యవధిలోనే ప్రాణాలతో పట్టుబడిన రెండో ఉగ్రవాది అహ్మద్, మొదటి వాడు నవీద్. ఈ నెల 5న ఉధంపూర్‌లోని నవీద్ అనే ఉగ్రవాదిని భారత్ సైన్యం పట్టుకున్న విషయం విదితమే. వీరిద్దరూ పాకిస్థాన్ కేంద్రంగా పని చేస్తున్న లష్కరే తోయిబా ఉగ్రవాదులేనని స్పష్టమైంది.
పాక్ కాల్పుల్లో ముగ్గురు పౌరులు మృతి
పాకిస్థాన్ మరోసారి కాల్పులకు తెగబడింది. అలవాటు ప్రకారం విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి ఈ సంఘటనకు పూనుకుంది. జమ్మూలోని ఆర్‌ఎస్ పురా సెక్టార్ వద్ద గత రాత్రి నుంచి పాకిస్థాన్ బలగాలు కాల్పులు జరుపుతున్నాయి. ఈ కాల్పుల్లో మహిళతో పాటు ముగ్గురు పౌరులు మృతి చెందారు. 22 మంది తీవ్రంగా గాయపడ్డారు. బీఎస్‌ఎఫ్ జవాన్ల స్థావరాలను లక్ష్యంగా చేసుకున్న పాక్ బలగాలు మోర్టార్ బాంబులను విసిరాయి. పాక్ కాల్పులను భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొడుతున్నా సాధారణ పౌరులు మరణించడం ఆగలేదు. పాక్ కాల్పుల్లో మంగళవారం ఆర్మీ అధికారి మృతి చెందిన విషయం విదితమే. ఆగస్టు 15 నుంచి నేటి వరకు మొత్తం ఆరుగురు సాధారణ పౌరులు పాక్ కాల్పుల్లో మృతి చెందారు.
Tags:    
Advertisement

Similar News