భూ సేకరణకు కేఈ వ్యతిరేకం
ఏపీలో రాజధాని నిర్మాణం కోసం జరుగుతున్న భూ సేకరణపై వ్యతిరేకత క్రమంగా పెరుగుతోంది. ఇటీవల భూసేకరణకు వ్యతిరేకంగా పవన్ చేసిన వ్యాఖ్యలు మరిచిపోకముందే, తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం కేఈ వ్యాఖ్యలు బాబుకు తలనొప్పిగా మారాయి. భూసేకరణ విషయంలో మొదటి నుంచి కేఈ దూరంగా ఉంటున్నారు. అందుకే ప్రతిపక్షాలు కేఈ ఆధ్వర్యంలో జరగాల్సిన భూసేకరణను మరొకరికి అప్పగించడంలో ఆంతర్యం ఏంటని ప్రశ్నిస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా కేఈ వ్యాఖ్యలతో ప్రతిపక్షాల ఆరోపణలు నిజమని తేలాయి. రైతుల సాగు […]
Advertisement
ఏపీలో రాజధాని నిర్మాణం కోసం జరుగుతున్న భూ సేకరణపై వ్యతిరేకత క్రమంగా పెరుగుతోంది. ఇటీవల భూసేకరణకు వ్యతిరేకంగా పవన్ చేసిన వ్యాఖ్యలు మరిచిపోకముందే, తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం కేఈ వ్యాఖ్యలు బాబుకు తలనొప్పిగా మారాయి. భూసేకరణ విషయంలో మొదటి నుంచి కేఈ దూరంగా ఉంటున్నారు. అందుకే ప్రతిపక్షాలు కేఈ ఆధ్వర్యంలో జరగాల్సిన భూసేకరణను మరొకరికి అప్పగించడంలో ఆంతర్యం ఏంటని ప్రశ్నిస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా కేఈ వ్యాఖ్యలతో ప్రతిపక్షాల ఆరోపణలు నిజమని తేలాయి.
రైతుల సాగు భూములను సేకరించి రాజధానిని నిర్మించడం తనకు ఇష్టం లేదని, తాను మొదటి నుంచి భూసేకరణకు వ్యతిరేకమని ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి స్పష్టం చేశారు. ఈ మేరకు కేఈ కృష్ణమూర్తి గురువారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ రాజధాని నిర్మాణానికి ప్రతిష్ఠాత్మక స్థాయిలో చేపట్టిన భారీస్థాయి భూసేకరణను తాను మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నానని కుండబద్దలు కొట్టారు. అయినా ఇప్పటికే రాజధాని నగర నిర్మాణానికి రైతులు చాలా భూములు ఇచ్చారని చెప్పారు. అదనంగా భూమి సేకరించాల్సిన అవసరమే లేదని స్పష్టం చేశారు. రైతు కుటుంబం నుంచి వచ్చిన వారికే వారి బాధలు తెలుస్తాయని పేర్కొన్నారు. రైతుల నుంచి బలవంతపు భూసేకరణ ఆపాలని జనసేన అధ్యక్షుడు పవన్ చేసిన వ్యాఖ్యలను కేఈ సమర్థించారు. రైతు బాధలు తెలిసిన వారెవరైనా అలాగే అంటారని అన్నారు. తాను మొదటి నుంచి రైతుల భూమి సేకరణకు వ్యతిరేకం కాబట్టే.. ఈ అంశానికి దూరంగా ఉన్నానని చెప్పారు. అందుకే నా రెవెన్యూ శాఖలో జరగాల్సిన భూ సేకరణ, మున్సిపల్ మంత్రి నారాయణ ఆధ్వర్యంలో జరుగుతోందని చెప్పారు. తాను ఇక అప్పటి నుంచి ఈ అంశానికి దూరంగా ఉంటున్నాని వివరించారు. ఇందులో ఎలాంటి జోక్యం చేసుకోవడం లేదని స్పష్టం చేశారు.
Advertisement