బీహార్ ప్యాకేజీ అంకెల గారడీ: నితీష్
బీహార్‌కు కేంద్రం ప్రకటించిన రూ.1.25 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రధాని మోడీ అంకెల గారడీగా ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ అభివర్ణించారు. ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కేంద్రం ప్రకటించిన ప్యాకేజీలో 87 శాతం నిధులు రాష్ట్రంలోని వివిధ పథకాల అమలుకు గతంలో కేటాయించినవేనని అన్నారు. కేవలం పదివేల కోట్లను మాత్రమే మోడీ కొత్తగా ప్రకటించారని అయితే వాటిని ఎప్పుడు విడుదల చేస్తారో తెలియదని ఆయన ఎద్దేవా విమర్శించారు. మోడీ లక్ష కోట్ల ప్యాకేజీ ప్రకటన బీహార్ ప్రజల గౌరవానికి భంగం […]
Advertisement
బీహార్‌కు కేంద్రం ప్రకటించిన రూ.1.25 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రధాని మోడీ అంకెల గారడీగా ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ అభివర్ణించారు. ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కేంద్రం ప్రకటించిన ప్యాకేజీలో 87 శాతం నిధులు రాష్ట్రంలోని వివిధ పథకాల అమలుకు గతంలో కేటాయించినవేనని అన్నారు. కేవలం పదివేల కోట్లను మాత్రమే మోడీ కొత్తగా ప్రకటించారని అయితే వాటిని ఎప్పుడు విడుదల చేస్తారో తెలియదని ఆయన ఎద్దేవా విమర్శించారు. మోడీ లక్ష కోట్ల ప్యాకేజీ ప్రకటన బీహార్ ప్రజల గౌరవానికి భంగం కలిగించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు ఎవరిని గెలిపించాలో స్పష్టంగా తెలుసని, అంకెలగారడీతో మోసం చేసేవారికి తగిన శాస్తి చేస్తారని అన్నారు.
Advertisement