పాక్‌కు జర్నలిస్ట్ షాక్
అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ఆచూకీ కనుక్కోలేక చతికిల పడిన భారత ఇంటలిజెన్స్ వ్యవస్థకు, అతడు పాకిస్థాన్‌లో లేడని బుకాయిస్తున్నపాక్ ప్రభుత్వానికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చాడు ఆ దేశ జర్నలిస్ట్.. దావూద్‌ను 2007లో రెండుసార్లు కరాచీలో కలిసి మాట్లాడాను. అతడిని కరాచీలో కలవడం చాలా సులభమని ఆయన ఓ జాతీయ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. అమెరికాలోని వర్జీనియాలో ఉంటున్న ఆరిఫ్ జమాల్ గతంలో న్యూయార్క్ టైమ్స్‌కు పాక్‌లో రిపోర్టర్‌గా పని చేశారు. ఆ […]
Advertisement
అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ఆచూకీ కనుక్కోలేక చతికిల పడిన భారత ఇంటలిజెన్స్ వ్యవస్థకు, అతడు పాకిస్థాన్‌లో లేడని బుకాయిస్తున్నపాక్ ప్రభుత్వానికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చాడు ఆ దేశ జర్నలిస్ట్.. దావూద్‌ను 2007లో రెండుసార్లు కరాచీలో కలిసి మాట్లాడాను. అతడిని కరాచీలో కలవడం చాలా సులభమని ఆయన ఓ జాతీయ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. అమెరికాలోని వర్జీనియాలో ఉంటున్న ఆరిఫ్ జమాల్ గతంలో న్యూయార్క్ టైమ్స్‌కు పాక్‌లో రిపోర్టర్‌గా పని చేశారు. ఆ సమయంలోనే దావూద్‌ను కలిశానని వెల్లడించారు. దావూద్ కొంతమందినే కలుస్తాడు. పటిష్టమైన భద్రత మధ్య అతను నివాసం ఉంటున్నాడు, తనకు తెలిసి అతనెలాంటి ఫేషియల్ సర్జరీ చేయించుకోలేదని ఆయన చెప్పారు. దావూద్ ఇంటి పక్కనే అతని సోదరుడు అనీస్ ఇబ్రహం కూడా నివాసముంటున్నాడని ఆయన వెల్లడించారు.
Advertisement