హోదాకి ఒప్పించలేక... ప్యాకేజీకోసం పాకులాట

ఏపీకి ప్ర‌త్యేక హోదా విష‌యంలో కేంద్రాన్ని ఒప్పించ‌లేక పోతున్న‌ సీఎం చంద్ర‌బాబు రాష్ట్రానికి క‌నీసం ప్ర‌త్యేక ప్యాకేజీ అయినా ప్ర‌క‌టించాల‌ని ప్ర‌ధానిని కోరిన‌ట్లు ఢిల్లీ నుంచి వార్త‌లు వెలువ‌డుతున్నాయి. ఏపీకి రూ. 2.25 ల‌క్ష‌ల కోట్ల ప్యాకేజీ ఇవ్వాల‌ని చంద్ర‌బాబు ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోడీని కోరిన‌ట్లు ఢిల్లీలో వ‌చ్చిన వార్త‌లు ఆంధ్ర్రప్రదేశ్‌లో చ‌ర్చ‌నీయాంశ‌మ‌య్యాయి.  బీహార్ మాదిరిగా ఆంధ్రాకు కూడా ప్ర‌త్యేక ప్యాకేజీ ప్ర‌క‌టించాల‌ని కోరుతూ చంద్ర‌బాబు ఆర్థిక‌శాఖ‌తో రూపొందించిన ప్ర‌తిపాద‌న‌ల‌ను కేంద్రం ముందుంచారని ఆ వార్త‌ల సారాంశం. […]

Advertisement
Update:2015-08-27 09:30 IST
ఏపీకి ప్ర‌త్యేక హోదా విష‌యంలో కేంద్రాన్ని ఒప్పించ‌లేక పోతున్న‌ సీఎం చంద్ర‌బాబు రాష్ట్రానికి క‌నీసం ప్ర‌త్యేక ప్యాకేజీ అయినా ప్ర‌క‌టించాల‌ని ప్ర‌ధానిని కోరిన‌ట్లు ఢిల్లీ నుంచి వార్త‌లు వెలువ‌డుతున్నాయి. ఏపీకి రూ. 2.25 ల‌క్ష‌ల కోట్ల ప్యాకేజీ ఇవ్వాల‌ని చంద్ర‌బాబు ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోడీని కోరిన‌ట్లు ఢిల్లీలో వ‌చ్చిన వార్త‌లు ఆంధ్ర్రప్రదేశ్‌లో చ‌ర్చ‌నీయాంశ‌మ‌య్యాయి. బీహార్ మాదిరిగా ఆంధ్రాకు కూడా ప్ర‌త్యేక ప్యాకేజీ ప్ర‌క‌టించాల‌ని కోరుతూ చంద్ర‌బాబు ఆర్థిక‌శాఖ‌తో రూపొందించిన ప్ర‌తిపాద‌న‌ల‌ను కేంద్రం ముందుంచారని ఆ వార్త‌ల సారాంశం. ప్ర‌ధానిని తాను ఎలాంటి ప్యాకేజీ కోర‌లేద‌ని చంద్ర‌బాబు ప్ర‌క‌టించిన మ‌రుస‌టి రోజే ఈ వార్త‌లు వెలువ‌డ‌డం ఆస‌క్తిని క‌లిగిస్తోంది. ఏపీకి ప్ర‌త్యేక‌హోదా ప్ర‌జ‌ల సెంటిమెంట్ అని క‌చ్చితంగా ఇచ్చి తీరాల్సిందేన‌ని బహిరంగ ప్ర‌క‌ట‌న‌లు చేస్తున్న చంద్ర‌బాబు తెర‌ వెనుక మాత్రం హోదా ఇవ్వ‌క‌పోతే భారీ ప్యాకేజీ అయినా ఇవ్వ‌మ‌ని కోరడం ఆయ‌న ద్వంద్వ‌ వైఖ‌రికి నిద‌ర్శ‌మ‌ని ప్ర‌తిప‌క్షాలు ఆరోపిస్తున్నాయి.
Tags:    
Advertisement

Similar News