శ్రీలంక ఒత్తిడికి తలొగ్గిన అమెరికా
లంకేయుల ఒత్తిడికి అమెరికా తలొగ్గింది. మొన్నటి వరకు శ్రీలంకలో జరిగిన తమిళుల ఊచకోతపై అంతర్జాతీయ స్థాయి స్వతంత్ర సంస్థతో దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేసిన అమెరికా ఇప్పుడు తన వైఖరిని మార్చుకుంది. శ్రీలంక ప్రభుత్వం డిమాండ్ మేరకు అంతర్జాతీయ స్థాయి విచారణ కాకుండా స్థానిక ప్రభుత్వంతోనే విచారణ జరిపేందుకు అమెరికా మద్దతు ప్రకటించింది. సెప్టెంబరులో జరగనున్న ఐక్యరాజ్యసమితి మానవహక్కుల సదస్సులో శ్రీలంకతో కలిసి ఈ సంయుక్త తీర్మానాన్ని ప్రవేశపెడతామని అమెరికా విదేశాంగ సహాయ మంత్రి నిషాబిశ్వాల్ కొలంబోలో […]
Advertisement
లంకేయుల ఒత్తిడికి అమెరికా తలొగ్గింది. మొన్నటి వరకు శ్రీలంకలో జరిగిన తమిళుల ఊచకోతపై అంతర్జాతీయ స్థాయి స్వతంత్ర సంస్థతో దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేసిన అమెరికా ఇప్పుడు తన వైఖరిని మార్చుకుంది. శ్రీలంక ప్రభుత్వం డిమాండ్ మేరకు అంతర్జాతీయ స్థాయి విచారణ కాకుండా స్థానిక ప్రభుత్వంతోనే విచారణ జరిపేందుకు అమెరికా మద్దతు ప్రకటించింది. సెప్టెంబరులో జరగనున్న ఐక్యరాజ్యసమితి మానవహక్కుల సదస్సులో శ్రీలంకతో కలిసి ఈ సంయుక్త తీర్మానాన్ని ప్రవేశపెడతామని అమెరికా విదేశాంగ సహాయ మంత్రి నిషాబిశ్వాల్ కొలంబోలో ప్రకటించారు. దీంతో అమెరికా తన వైఖరిని మార్చుకుందని ప్రపంచానికి స్పష్టమైంది.
Advertisement