Wonder World 7

మీసాలకు అంటని టీ కప్పులు పొడవైన మీసాలు, గుబురు మీసాలు ఉండేవాళ్లు ఏం తాగాలన్నా, ఏం తినాలన్నా నానా ఇబ్బందీ పడుతుంటారు. తాగినా, లేదా తిన్నా వెంటనే మీసాలను సవరించుకుంటూ కనిపిస్తుంటారు. ఇలాంటి వారు ఏ ఇబ్బందీ లేకుండా తేనీరు సేవించడం కోసం విక్టోరియా శకంలో ప్రత్యేకమైన టీ కప్పులు తయారు చేసేవారట. మీసాలకు ఏ మాత్రం అంటకుంటా టీ తాగడానికి అవి భలే ఉపకరించేవట. ——————————————————————————————————- పెంపుడు జంతువులు అంత మంచివేం కావు! పెంపుడు జంతువులంటే అందరికీ ఇష్టమే. […]

Advertisement
Update: 2015-08-25 13:04 GMT

మీసాలకు అంటని టీ కప్పులు

పొడవైన మీసాలు, గుబురు మీసాలు ఉండేవాళ్లు ఏం తాగాలన్నా, ఏం తినాలన్నా నానా ఇబ్బందీ పడుతుంటారు. తాగినా, లేదా తిన్నా వెంటనే మీసాలను సవరించుకుంటూ కనిపిస్తుంటారు. ఇలాంటి వారు ఏ ఇబ్బందీ లేకుండా తేనీరు సేవించడం కోసం విక్టోరియా శకంలో ప్రత్యేకమైన టీ కప్పులు తయారు చేసేవారట. మీసాలకు ఏ మాత్రం అంటకుంటా టీ తాగడానికి అవి భలే ఉపకరించేవట.
——————————————————————————————————-
పెంపుడు జంతువులు అంత మంచివేం కావు!

పెంపుడు జంతువులంటే అందరికీ ఇష్టమే. కానీ వాటి గురించిన ఓ నమ్మలేని నిజం మీకు తెలుసా? యజమాని ఇంట్లో ఒంటరిగా ఉన్నపుడు చనిపోతే ఆ భౌతిక కాయాన్ని వారు పెంచుకునే పెంపుడు జంతువులే తినేస్తాయి. అందులో కుక్కలైతే అవి ఆకలికి తట్టుకోలేనంత వరకు వేచి చూస్తాయి. అదే పిల్లులైతే యజమాని మరణించిన మరుక్షణం తినడం ప్రారంభిస్తాయట.
——————————————————————————————————-
మార్కులు పెంచే బబుల్‌గమ్‌!

పరీక్షల్లో తక్కువ మార్కులు వస్తున్నాయా? అయితే రోజూ బబుల్‌గమ్‌ నమిలి చూడండి. వచ్చే పరీక్షల్లో మీకు ఊహించనన్ని మార్కులు తథ్యం. ఐదునిముషాలసేపు బబుల్‌గమ్‌ నమిలితే చాలు మీ మార్కుల స్కోరులో మంచి తేడా వచ్చేస్తుందట. ఇదేదో బబుల్‌గమ్‌ కంపెనీల మార్కెటింగ్‌ స్ట్రాటజీ అనుకునేరు. కానేకాదు. బబుల్‌గమ్‌ నమలడం మూలంగా మెదడులోకి రక్తప్రసరణ బాగా జరిగి జ్ఞాపకశక్తి పెరుగుతుండట. అలాగని ఎక్కువ బబుల్‌ గమ్‌లు నమిలేస్తే అసలుకే ఎసరు వస్తుంది. మెదడుశక్తి క్షీణించి మనం బాగా అలసిపోతామట.

Tags:    
Advertisement

Similar News