స్వల్పంగా తగ్గుముఖం పట్టిన ఉల్లి ధర
తెలంగాణలో ఉల్లి ధర స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. హైదరాబాద్‌లోని హోల్‌సేల్ మార్కెట్‌లో మొన్నటి వరకూ కిలో ధర రూ. 67 పలకిన ఉల్లి, మంగళవారం రూ. 60కు దిగివచ్చింది. దీంతో, వినియోగదారులు స్వల్పంగా ఊరట చెందారు. కర్నూలు, కర్నాటక చెందిన ఉల్లి రకాల దిగుమతి కారణంగా వాటి ధరలు రెండు రోజుల్లోనే కిలోకు రూ. 10 తగ్గాయని మార్కెటింగ్ శాఖ అధికారులు వెల్లడించారు. ఉత్తరప్రదేశ్‌లో ఉల్లికి తీవ్ర గిరాకీ ఏర్పడటంతో మహారాష్ట్ర రైతులు, వ్యాపారులు తమ ఎగుమతులను […]
Advertisement
తెలంగాణలో ఉల్లి ధర స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. హైదరాబాద్‌లోని హోల్‌సేల్ మార్కెట్‌లో మొన్నటి వరకూ కిలో ధర రూ. 67 పలకిన ఉల్లి, మంగళవారం రూ. 60కు దిగివచ్చింది. దీంతో, వినియోగదారులు స్వల్పంగా ఊరట చెందారు. కర్నూలు, కర్నాటక చెందిన ఉల్లి రకాల దిగుమతి కారణంగా వాటి ధరలు రెండు రోజుల్లోనే కిలోకు రూ. 10 తగ్గాయని మార్కెటింగ్ శాఖ అధికారులు వెల్లడించారు. ఉత్తరప్రదేశ్‌లో ఉల్లికి తీవ్ర గిరాకీ ఏర్పడటంతో మహారాష్ట్ర రైతులు, వ్యాపారులు తమ ఎగుమతులను అటు మళ్లించారు. దీంతో రాష్ట్రానికి ఉల్లి కొరత ఏర్పడిందని అధికారులు చెబుతున్నారు. అయితే, కర్నూలు, కర్నాటక నుంచి ఉల్లి దిగుమతి అవుతుండడంతో పరిస్థితి మెల్లగా చక్కబడుతోందని వారు అన్నారు. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన చర్యల ఫలితంగా ఉల్లి ధర త్వరలోనే కిందకు దిగి వస్తుందని వారు భావిస్తున్నారు.
Advertisement