అఖిల్ సినిమా కోసం మరో పేరు
నాగార్జున బర్త్ డే దగ్గరపడుతోంది. ఇంకా 3 రోజులు మాత్రమే టైం ఉంది. ఈ 3 రోజుల్లో అఖిల్ కొత్త సినిమాకు మంచి పేరు పెట్టాలి. ప్రస్తుతం సినిమా యూనిట్ అంతా ఈ పనిమీదే ఉంది. ఎవరికి తోచిన టైటిల్స్ వాళ్లు చెబుతున్నారు. కానీ ఎవరికీ ఏ టైటిల్ నచ్చడం లేదు. కొందరేమే బాలరాజు టైటిల్ పెట్టేయమని సూచిస్తున్నారు. మరికొందరు మిస్సైల్ అనే పేరుపెట్టమని చెబుతున్నారు. ఇలాంటి ఊహాగానాల నేపథ్యంలో ఏకంగా ఓ టైటిల్ ఫిలింఛాంబర్ లో […]
Advertisement
నాగార్జున బర్త్ డే దగ్గరపడుతోంది. ఇంకా 3 రోజులు మాత్రమే టైం ఉంది. ఈ 3 రోజుల్లో అఖిల్ కొత్త సినిమాకు మంచి పేరు పెట్టాలి. ప్రస్తుతం సినిమా యూనిట్ అంతా ఈ పనిమీదే ఉంది. ఎవరికి తోచిన టైటిల్స్ వాళ్లు చెబుతున్నారు. కానీ ఎవరికీ ఏ టైటిల్ నచ్చడం లేదు. కొందరేమే బాలరాజు టైటిల్ పెట్టేయమని సూచిస్తున్నారు. మరికొందరు మిస్సైల్ అనే పేరుపెట్టమని చెబుతున్నారు. ఇలాంటి ఊహాగానాల నేపథ్యంలో ఏకంగా ఓ టైటిల్ ఫిలింఛాంబర్ లో రిజిస్టర్ అయింది. దీంతో అంతా షాకయ్యారు. అదే అఖిల్ కొత్త సినిమా టైటిల్ అంటూ ప్రచారం జరుగుతోంది. శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్ పై తాజాగా ధమాకా అనే టైటిల్ ను రిజిస్టర్ చేయించారు. నితిన్ కు చెందిన ఈ బ్యానర్ పైనే ప్రస్తుతం అఖిల్ సినిమా చేస్తున్నాడు. దీంతో సిసింద్రీ తాజా సినిమాకు ధమాకా అనే పేరుపెడతారనే ప్రచారం ఊపందుకుంది. అయితే ఈ టైటిల్ ను అఖిల్ కోసమే రిజిస్టర్ చేయించారా.. లేక నితిన్ కొత్త సినిమా కోసం పడుంటుందని రిజిస్టర్ చేయించారా అనే విషయం మాత్రం ఎవరికీ అంతుచిక్కడం లేదు. ఏదేమైనా అఖిల్ సినిమా టైటిల్ పై మరో 3 రోజుల్లో క్లారిటీ వచ్చేస్తుంది.
Advertisement