ప్రభుత్వ జీవోపై హైకోర్టు విస్మయం
తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన బ్యాంకు గ్యారంటీ జీవోపై హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ప్రైవేట్ వైద్య కళాశాలల్లో చేరే ఫస్టియర్ విద్యార్ధుల వద్ద మిగిలిన నాలుగు ఏళ్లకు బ్యాంకు గ్యారంటీని తీసుకోవడానికి యాజమాన్యాలకు అనుమతిస్తూ టీ.సర్కార్ జీవో జారీ చేసింది. దీన్ని సవాల్ చేస్తూ ఓ విద్యార్ధిని, ఇతరులు వేసిన పిటిషన్‌ను హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం మంగళవారం విచారించింది. బ్యాంకు గ్యారంటీ ఇచ్చేందుకు ఇదేమైన జాతీయ రహదారి నిర్మాణ పనుల వ్యవహారమా అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. […]
Advertisement
తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన బ్యాంకు గ్యారంటీ జీవోపై హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ప్రైవేట్ వైద్య కళాశాలల్లో చేరే ఫస్టియర్ విద్యార్ధుల వద్ద మిగిలిన నాలుగు ఏళ్లకు బ్యాంకు గ్యారంటీని తీసుకోవడానికి యాజమాన్యాలకు అనుమతిస్తూ టీ.సర్కార్ జీవో జారీ చేసింది. దీన్ని సవాల్ చేస్తూ ఓ విద్యార్ధిని, ఇతరులు వేసిన పిటిషన్‌ను హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం మంగళవారం విచారించింది. బ్యాంకు గ్యారంటీ ఇచ్చేందుకు ఇదేమైన జాతీయ రహదారి నిర్మాణ పనుల వ్యవహారమా అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అసలు ఈ జీవోను జారీ చేసే అధికారం ప్రభుత్వానికి ఎక్కడదని ప్రశ్నించింది. దీనికి సంబంధించిన అన్ని వివరాలను కోర్టు ముందుంచాలని ఆదేశిస్తూ విచారణను గురువారానికి వాయిదా వేసింది.
Advertisement